నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “NBK107” అనే వర్కింగ్ టైటిల్ తో సరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఇటీవల బాలయ్య బాబు కరోనా బారిన పడటంతో పాటు ఈ సినిమా యూనిట్ సభ్యులు కూడా కరోనా బారిన పడటంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో ఈ సినిమా దసరాకి రావలసింది ఇప్పుడు డిసెంబర్ నెలలో వస్తున్నట్లు తెలుస్తోంది.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం మరోకొద్దీ రోజులో ఈ సినిమా టైటిల్ ప్రకటించడానికి మేకర్స్ రెడీ అయినట్లు సమాచారం. త్వరలోనే మంచి ముహూర్తం చేసుకుని ప్రకటించాలని బాలకృష్ణ కూడా సినిమా యూనిట్ కి ఇటీవల ఆదేశాలు జారీ చేయడం జరిగిందట. వరుస పెట్టి బ్లాక్ బస్టర్ సినిమాలు తీస్తున్న గోపీచంద్ మలినేని… వైవిద్యమైన సబ్జెక్టుతో ఈ సినిమాలో బాలకృష్ణ నీ చూపిస్తున్నారట. ఇటీవల సినిమాకి సంబంధించి చిన్నపాటి ఫస్ట్ లుక్ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది.
దానిలో బాలకృష్ణ హై వోల్టేజ్ యాక్షన్ డైలాగులు చెప్పడంతోపాటు చిత్రీకరణ కూడా ఆ రీతిగానే ఉండటంతో బాలయ్య అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. శృతిహాసన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల కరోనా నుండి కోలుకున్న బాలయ్య ప్రస్తుతం “NBK 107” షూటింగ్ సెట్ లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా నవంబర్ నెల కల్లా సినిమా కంప్లీట్ చేసి డిసెంబర్ లో అది కూడా “అఖండ” రిలీజ్ అయిన తేదీ నాడు.. ఈ సినిమా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!