నువ్వు ఎంత మంచి వాడివి మా నాన్న మా అమ్మను వెళ్లగొట్టినా.. నువ్వు బాగా చూసుకున్నావ్ సార్ మమ్మల్ని అని దేవి అంటుంది.. అదేంటమ్మా నాన్న అని పిలవకుండా సార్ అని పిలుస్తున్నావు మాధవ్ షాక్ అవుతూ అడుగుతాడు.. నేను అనవసరంగా నీకు ఈ విషయాన్ని చెప్పినట్టు ఉన్నాను అని మాధవ్ అంటాడు .. నిన్ను దూరం చేసుకోవడానికి నేను ఈ విషయం చెప్పలేదు.. నీలాంటి బంగారు తల్లి నా కడుపున పుట్టలేదు అన్న విషయాన్ని నీకు చెప్పాను.. అని మాధవ్ కల్లబుల్లిన మాటలతో దేవిని మచ్చిక చేసుకుంటాడు..
దేవి మాధవ్ తో మా నాయన నాకు కనిపించాలి.. తనను మందిలో పెట్టీ విజ్జ్యుత్ తీస్తాను.. ఆ కసాయి వాడి చేత మా అమ్మకు సారీ చెప్పిస్తా.. వాడిని నేను వదిలి పెట్టాను అని దేవి అంటుండగా.. అతని గురించి మరచిపో.. నేను నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని పైకి తీసుకువెళ్తాడు.. జస్ట్ టోర్నమెంట్ లో గెలిచిన దేవికి సర్ప్రైజ్ పార్టీ ఇస్తాడు.. తన చేత కేక్ కటింగ్ చేపిస్తాడు.. ఇదంతా చూసి రాదా కోపంతో పగిలిపోతుంది నువ్వు ఎంత తెలివైన వాడివి మాధవ్ సారు.. బిడ్డ మనసులో ఎంత విషయాన్ని నింపుతున్నావు అని లోపల బాధపడుతుంది..
దేవి నిద్రలో నాయన కడుపుతో ఉన్న నిన్ను ఎట్లా ఇంట్లో నుంచి బయటకు పంపించేసాడు. నిన్ను ఎలా కొట్టాలనిపించింది. నాయనను నేను వదిలిపెట్టను అమ్మ కచ్చితంగా తన్ని వెతికి పట్టుకుంటాను. తగిన గుణపాఠం చెబుతాను అని దేవి నిద్రలో కలవరిస్తూ ఉంటుంది. అది చూసిన రాదా పక్కకు వచ్చి బాధపడుతుంది. అప్పుడే మాధవ్ వచ్చి ఎందుకు రాధ ఏడుస్తున్నావు అని అంటాడు. ఈ ఇంట్లో నాకు ఏడ్చే హక్కు కూడా లేదా అని అంటుంది. ఊరికే వచ్చే కన్నీళ్ళను ఎందుకు వృధా చేయకూడదు అని మాధవ్ లెక్చరిస్తాడు.. దాంతో రాధ ఏడుస్తూ పక్కకు వెళ్ళిపోతుంది..
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!