NewsOrbit
జాతీయం న్యూస్

ఢిల్లీ పోలీస్ బాస్ గా ఐటీబీపీ డీజీ సంజయ్ ఆరోరా.. ఇవి ఆయన ప్రత్యేకతలు

ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ ఆరోరా నియమితులైయ్యారు. ప్రస్తుత ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాకేశ్ అస్థానా ఈ రోజు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ .. ప్రస్తుతం ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) డీజీగా పని చేస్తున్న సంజయ్ అరోరాను ఢిల్లీ పోలీస్ చీఫ్ గా నియమిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. సంజయ్ ఆరోరా తమిళనాడు క్యాడర్ కు చెందిన 1988 ఐపీఎస్ అధికారి.ఆయన రాజస్థాన్ లోని జైపూర్ మాల్వియా నేషనల్ ఇన్సిట్యూట్ ఆప్ టెక్నాలజీ నుండి ఇఇఇ విభాగంగా ఇంజనీరింగ్ పూర్తి చేశారు.

 

ఐపీఎస్ పూర్తి అయిన తరువాత అరారో తమిళనాడు పోలీస్ విభాగంలో వివిధ హోదాల్లో పని చేశారు. తమిళనాడులో ఎస్పీగా పని చేసిన సమయంలో పేరు మోసిన స్మగ్లర్ వీరప్పన్ గ్యాంగ్ పట్టుకునేందుకు ఏర్పడిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు నాయకత్వం వహించారు. ఆనాడు ఆయన చూపిన ధైర్య సాహాసాలకు, వీరోచిత చర్యలకు ఆరోరాకు సీఎం శౌర్య పతకం లభించింది. ఆ తరువాత 1991 లో ఆరోరా ఎస్ఎస్ జీ శిక్షణ పొందిన తర్వాత ఎల్ టీ టీ ఈ కార్యకలాపాలు విస్తృతంగా ఉన్న సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి భద్రత కల్పించేందుకు గానూ ప్రత్యేక పోలీస్ బృందాన్ని (ఎస్ఎస్ జీ) ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.

1997 నుండి 2002 వరకూ కమాండెంట్ గా ఐటీబీపీలో డిప్యూటైషన్ పై పని చేశారు. 1997 నుండి 2000 వరకూ ఉత్తరాఖండ్ లోని మట్లీలో సరిహద్దు రక్షణ ఐటీబీపీ బెటాలియన్ కమాండెంట్ గా. 2000 నుండి 2002 వరకూ ముస్సోరీలోని ఐటీబీపీ అకాడమిలో కమాండెంట్ గా బాధ్యతలు నిర్వహించారు. 2002 నుండి 2004 వరకూ కోయంబత్తూరు నగర పోలీస్ కమిషనర్ గా, ఆ తరువాత విల్లుపురం పరిధిలో డీఐజీగా, విజిలెన్స్ అండ్ ఏసీబీ డీడీ గా పని చేశారు. తదుపరి చెన్నై అడిషనల్ కమిషనర్, తద్వార పదోన్నతిపై తమిళనాడు ఏడిజీపీ (ఆపరేషన్స్ అండ్ పరిపాలన) పని చేశారు. ఐటీబీపీ డీజీగా నియమితుుల కాకముందు ఐజీ బీఎస్ఎఫ్, చత్తీస్ గఢ్ సెక్టార్ సీఆర్పీఎఫ్ ఐజీ, సీఆర్పీఎఫ్ ఏడీజీ, జమ్ము కశ్మీర్ జోన్ సీఆర్పీఎఫ్ స్పెషల్ డీజీగా బాధ్యతలు నిర్వహించారు. పోలీస్ శాఖలో విశిష్ట సేవలకు గానూ ఆరోరా 2014 లో రాష్ట్రపతి నుండి పోలీస్ మెడల్ తో పాటు యూఎన్ శాంతి పరిరక్షణ పతకం వంటి అనేక అవార్డులు అందుకున్నారు.

బ్రేకింగ్: ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేసిన కాంగ్రెస్ .. పార్టీ నుండి సస్పెండ్

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju