ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తేరకెక్కిన “భీమ్లా నాయక్” రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలవడం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా లో పవన్ తో పాటు దగ్గుబాటి రానా కూడా నటించారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ నటించగా… నెగిటివ్ రోల్ లో రానా కనిపించాడు. ఈ సినిమాలో రానా భార్యగా హీరోయిన్ సంయుక్త మీనన్ నటించింది. ఈ సినిమా విజయం సాధించటంతో సంయుక్త మీనన్ కి మంచి పేరు రావడం తెలిసిందే.
“భీమ్లా నాయక్” హిట్ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తమిళంలో ధనుష్ నటిస్తున్న “సార్” సినిమాలో హీరోయిన్ అవకాశం అందుకుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒక ఇదే సమయంలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన “బింబిసార” లో కూడా సంయుక్త మీనన్ నటించింది. కేథరిన్ తెరిసా తో పాటు సంయుక్త కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆగస్టు 5వ తారీఖు ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఇటువంటి తరుణంలో తాజాగా సంయుక్త మీనన్ తన జీవిత కాలంలో ఒక కోరికను ఎలాగైనా తీర్చుకుంటానని.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు ట్రావెలింగ్ అంటే పిచ్చి అని.. చనిపోయే లోపు ప్రపంచమంతా తిరగాలని తన కోరిక అని తెలిపింది. ట్రావెలింగ్ పై ఎంత ఇష్టం ఉందో తన వీపుపై ఉన్న టాటూ తెలియజేస్తుందని సంయుక్త మీనన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఏది ఏమైనా సరే జీవితంలో ఒకసారి ప్రపంచమంతా విహరించాలని తన కోరిక అని చెప్పుకొచ్చింది.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!