NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

మరో సారి హైకోర్టును ఆశ్రయించిన సీనియర్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మరో సారి హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తనపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని హైకోర్టును ఆశ్రయించిన ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పుడు తాజాగా ప్రభుత్వం పై కోర్టు దిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. సస్పెన్షన్ కాలంలో పూర్తి జీతం, అలవెన్స్ ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.. ప్రభుత్వం అమలు చేయడం లేదని ఏబీవీ కోర్టు దిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం విచారించగా.. కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని ఇప్పటికే రెండు పర్యాయాలు సీఎస్ కు లేఖలు రాసినట్లు ఏబీవీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 22 నుండి మాత్రమే పూర్తి వేతనం ఇచ్చారనీ, పాత బకాయిలు చెల్లించలేదని వివరించారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది.

గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావును భద్రతా పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై 2020 ఫిబ్రవరి 8న ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇదే అంశంపై ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. తన సస్పెన్షన్ అక్రమం అంటూ ఆయన హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చివరకు సుప్రీం కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఈ ఏడాది మే 18న ఆయనను విధుల్లోకి తీసుకుంది. జూన్ 14న ఆయనను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టిన 15 రోజుల్లోనే.. ఆయనపై నమోదైన ఏసీబీ కేసులో సాక్షులను ప్రభావితం చేసేందుకు యత్నించారన్న అభియోగంపై మరో సారి సస్పెండ్ చేసింది ప్రభుత్వం.

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

Related posts

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju