తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత ఆదరణ దక్కించుకున్న షోలలో ఒకటి బిగ్ బాస్. ప్రపంచవ్యాప్తంగా ఈ రియాల్టీ షోకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇండియాలో ఫస్ట్ టైం హిందీలో బిగ్ బాస్ షో ప్రసారం అయింది. అక్కడ మంచి ఆదరణ రావడంతో.. దక్షిణాదిలో పలు భాషల్లో కొద్ది సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషలలో ఇప్పటికే ఐదు సీజన్ లు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కాగా ఆరో సీజన్ తెలుగులో త్వరలో స్టార్ట్ కానుంది. ఇప్పటికే బిగ్బాస్ 6 లోగో..ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది. ఇటీవల వచ్చిన బిగ్బాస్ ఓటీటీ అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను పెద్దగా అల్లరించలేదు. 24 గంటలు ఎంటర్టైన్మెంట్ అన్నా గాని.. చూసిన వాళ్ళు ఎవరు కూడా అంతగా షోపట్ల ఇంట్రెస్ట్ చూపించలేదు.
డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయింది. ఓటిటి బిగ్ బాస్ షో పెద్దగా ఆదరణ దక్కించుకోలేదు. దీంతో ఇప్పుడు షో నిర్వాహకులు సీజన్ 6.. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండే రీతిలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టాప్ మోస్ట్ సెలబ్రిటీలను.. అందరికీ తెలిసిన ముఖాలను హౌస్ లో ఉండేలా చూసుకుంటున్నారు. అయితే మొత్తం 19 మంది సభ్యులు సెలెక్ట్ చేసినట్లు ముందుగా 15 మంది సభ్యులను హౌస్ లోకి పంపించి మిగతా నలుగురిని వైల్డ్ కార్డు రూపంలో పంపించే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నారట.
ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ 6 ఆగస్టు నెల చివరిలో స్టార్ట్ అవుతుందని వార్తలు రాగా ఇప్పుడు సెప్టెంబర్ మొదటివారం లేదా రెండో వారంలో స్టార్ట్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. చాలావరకు సెప్టెంబర్ 4వ తారీఖు ప్రారంభించే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తేదీ ప్రకారం డిసెంబర్ నెల ఆఖరికి 100 రోజులు సరిపోయే లెక్క ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా సెప్టెంబర్ నెలలో బిగ్బాస్ 6 ప్రారంభం అవుతున్న నేపథ్యంలో .. బిగ్ బాస్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.