TV Actress: ప్రెసెంట్ జనరేషన్ మొత్తం మోసాల చుట్టూ తిరుగుతుంది. ఒక నటిని పెళ్లి చేసుకోవడం మరొక నటి తో డేటింగ్ చేయడం ప్రస్తుత కాలంలో కామన్ అయిపోయింది. ఇక భార్యకి తెలియకుండా మరొక నటితో అక్రమ సంబంధం పెట్టుకోవడం అది కాస్త బయటపడడంతో వారు విడిపోవడం నేటి కాలంలో చాలా కామన్. ఇలా విడిపోయిన వారిలో ఎందరో ఉన్నారు. ఇక ప్రస్తుత కాలంలో సినీ ప్రముఖులై కాదు సీరియల్ ప్రముఖులు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. ఇటీవల మనసు మమతా సీరియల్ జంట కూడా విడిపోయింది. ఇక తాజాగా ఒక నటి హస్బెండ్ మరొక జూనియర్ ఆర్టిస్ట్ ని డ్రాప్ చేసి ప్రెగ్నెంట్ చేసి మోసం చేశాడు. మరి ఆ నటి హస్బెండ్ ఎవరు? ఎవరిని మోసం చేశారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సీరియల్ నటి శ్రావణి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్లో నటించడమే కాకుండా యూట్యూబ్ ఛానల్ ని కూడా రన్ చేస్తుంది. ఈమె ఒకప్పుడు ఎంతో సూపర్ హిట్ సీరియల్స్ లో అలాగే మూవీస్ లో కూడా నటించింది. ఓ మూవీలో కలిసి నటించి తన భర్త ప్రియాంత్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఇక బాబు రీసెంట్ గానే జన్మించాడు. ఇక ప్రస్తుతం శ్రావణి భర్త ప్రియాంత్ ఓ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ ఉన్నాడు. ప్రియాంత్ కి వెండితెరపై హీరోగా సక్సెస్ అవ్వాలని ఎన్నో ఏళ్ల నుంచి స్ట్రగుల్స్ ను పేస్ చేస్తున్నాడు.
ఆ తర్వాత సక్సెస్ ఇప్పుడు ఆయనకి దక్కింది. రీసెంట్ గానే కొత్తగా మా ప్రయాణం అనే మూవీతో కాస్త గుర్తింపును తెచ్చుకున్నాడు ఈ హీరో. ఇక ప్రస్తుతం అంతకుమించి నెగిటివిటీని ఫేస్ చేస్తున్నాడు. ప్రియాంత్ జూనియర్ ఆర్టిస్ట్ నీ ప్రేమ పేరుతో వాడుకుని మోసం చేశాడని ఆ జూనియర్ ఆర్టిస్ట్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత.. ఆ విషయం అడగా నీకు నాకు ఎటువంటి సంబంధం లేదంటూ తగేసి చెప్పాడట. ఇక ఇప్పుడు ఆ జూనియర్ ఆర్టిస్ట్ ప్రియాంత్ పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఇక సీరియల్స్ లో తనదైన నటన ప్రూవ్ చేసుకుని మంచి గుర్తింపుతో సంపాదించుకుంటున్న శ్రావణి భర్త ఇటువంటి పనిచేయడంతో ఇమికి కూడా నెగెటివిటీ పెరిగింది.
ప్రస్తుతం శ్రావణి మరియు తన భర్తకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న శ్రావణి తన భర్తను ఘోరంగా తిట్టిపోస్తుందట. అంతేకాకుండా విడాకులు ఇచ్చేందుకు కూడా రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ వార్త చూసిన పలువురు..” ఆ జూనియర్ ఆర్టిస్ట్ కి కూడా సిగ్గు లేదా? వీడికి కూడా పెళ్లయి పిల్లలు ఉన్నారు. వాడు మోసపు మాటలు చెప్పాడు అని తెలియదా. వాడి తప్పు ఎంతుందో ఆ జూనియర్ ఆర్టిస్ట్ తప్పు కూడా అంతే ఉంది. అయినా ఇలాంటి వారు ఎందుకు పుడతారో కూడా తెలియదు. కొంచమైనా మనకు శాంతి లేకుండా పోతుంది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!