Kamal Hassan: విలక్షణ నటుడు కమలహాసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి పాత్రనైనా అలవోకగా చేస్తూ తెరపై నవరసాలు పండించడంలో సిద్ధహస్తుడు. ముఖ్యంగా ప్రయోగాత్మకమైన పాత్రలు చేస్తూ.. నటుడిగా దక్షిణాదిలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. నటుడిగా కమలహాసన్ ఎన్నో రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. 2008వ సంవత్సరంలో కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో కమల్ నటించిన “దశావతారం” సినిమాలో పది పాత్రలో నటించి అప్పట్లో రికార్డు క్రియేట్ చేయడం తెలిసిందే. ఓకే సినిమాలో అన్ని పాత్రలలో ఎవ్వరు కూడా నటించలేదు.
ఇదిలా ఉంటే ఇప్పుడు “దశావతారం” మాదిరిగానే శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న “ఇండియన్ 2″లో కూడా మరో రికార్డు క్రియేట్ చేయడం జరిగిందంట. మ్యాటర్ లోకి వెళ్తే “ఇండియన్ 2″లో 14 భాషలలో పదినిమిషాల డైలాగ్ సింగిల్ టేక్ తో కమల్ చెప్పేశారట. ఈ వార్త తమిళ ఇండస్ట్రీలో సంచలనం రేపుతుంది. కమల్ హాసన్ 14 భాషల్లో ఈ డైలాగ్ చెప్తున్నా సమయంలో సెట్ లో ఉన్నవాళ్లంతా షాక్ కి గురయ్యారట. తన స్టనింగ్ పర్ఫామెన్స్ తో కమల్ మరోసారి తన నట విశ్వరూపం చూపించారట.
గతంలో ఈ సినిమా షూటింగ్ ఆగిపోగా ఇటీవల మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, బాబీ సింహా, సిద్ధార్థ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో “విక్రమ్” సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమాను కూడా త్వరగా కంప్లీట్ చేసి విడుదల చేయడానికి కమల్ ఆరాటపడుతున్నారు. ఈ సినిమా నిర్మాతలకు మరియు దర్శకుడు శంకర్ కి మధ్య అప్పట్లో గొడవలు జరగటంతో తర్వాత కోర్టు దాక వెళ్లడం షూటింగ్ ఆగిపోవడం తెలిసిందే. ఈ క్రమంలో కమల్ ఇటీవల చొరవ తీసుకొని రాజీ కుదుర్చడం జరిగింది. ఎంత త్వరగా అయితే అంతగా “ఇండియాన్ 2” షూటింగ్ కంప్లీట్ అయ్యేలా కమల్ సన్నాహాలు చేస్తున్నారట.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!