NewsOrbit
Entertainment News సినిమా

నాకో గర్ల్ ఫ్రెండ్ ఉండేది.. ‘గీతా ఆర్ట్స్’ లో గీతా పేరు అందుకే: అల్లు అరవింద్

గీతా ఆర్ట్స్.. టాలీవుడ్ లోనే ఓ అగ్ర నిర్మాణ సంస్థ. ఈ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందిన అల్లు అరవింద్.. నాటి నుంచి నేటి వరకు ఎందరికో లైఫ్ ఇచ్చారు. అయితే గీతా ఆర్ట్స్ లో అసలు `గీతా` అంటే ఎవరు అన్న సందేహం చాలా మందికి ఉంది. ఎందుకంటే గీతా అన్న పేరుతో అల్లు ఫ్యామిలిలో ఎవ్వరు లేరు. మరి ఈ గీతా ఎవరు అన్నా కుతూహలం ఎందరికో ఉంది.

అయితే తాజాగా ఈ విషయంపై అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. ప్రముఖ పాపులర్ టీవీ షో `ఆలీతో సరదాగా`లో పాల్గొన్న అల్లు అరవింద్.. గీతా ఆర్ట్స్ లో గీతా అంటే ఎవరు అన్నదానిపై వివరణ ఇచ్చారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. `గీతా ఆర్ట్స్ లో గీతా నా గర్ల్ ఫ్రెండ్ అనే డౌట్ చాలా మందిలో ఉంది. నిజంగానే నాకు గీతా అనే పేరుతో గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆమె పేరునే మా నిర్మాణ సంస్థకు పెట్టానని కొందరు అభిప్రాయపడుతుంటారు.

allu aravind
allu aravind

కానీ అందులో ఏమాత్రం వాస్త‌వం లేదు. గీత ఆర్ట్స్ అనే పేరుతో నిర్మాణ సంస్థను పెట్టాలని ఒక ప్రపోజల్ పెట్టింది మా నాన్నగారు అల్లు రామలింగయ్య గారు. ఆయనకు భగవద్గీత పై విపరీతమైన నమ్మకం ఉండేది. ఆ న‌మ్మ‌కంతోనే భగవద్గీతలోని గీతా పేరు నిర్మాణ సంస్థకు పెట్టాలని ఆయ‌న సూచించారు. గీతలో చెప్పినట్టు పనిచేయడమే మన వంతు.. ఫలితం మన చేతిలో ఉండదు. ఇది సినిమాకు సరిగ్గా సరిపోతుంది.

గీతకు దగ్గరగా ఉండడం వల్ల గీతా ఆర్ట్స్ పెడదామని నాన్నగారు అనడంతో అదే ఫైనల్ చేశాం` అంటూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఇక ఇంతలో ఆలీ క‌ల్పించుకుని.. `పెళ్లి తర్వాతైనా నిర్మల ఆర్ట్స్‌ పెట్టొచ్చు కదా` అని అనగా.. అందుకు అల్లు అరవింద్ అప్పటికే గీతా ఆర్ట్స్‌ బ్యానర్ నుంచి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. అందుకే పేరును మార్చలేదని న‌వ్వుతూ తెలిపారు. మొత్తానికి అల్లు అరవింద్ వ్యాఖ్యలతో గీతా ఆర్ట్స్ లో గీతా అంటే ఏంటో అందరికీ స్పష్టంగా అర్థం అయిపోయింది.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N