NewsOrbit
దైవం

Diwali 2022: దీపావళి ప్రాముఖ్యత, పూజా విధానం, వాటి ఫలాలు.

Diwali 2022 : భారతదేశంలో అత్యంత భక్తిశ్రద్ధలతో హిందువులు అతి పవిత్రంగా జరుపుకునే పెద్ద పండుగలలో దీపావళి ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని సూచించేదే ఈ దీపావళి పండుగ యొక్క సారాంశం.

ఈ క్రమంలో హిందువులతోపాటు సిక్కు, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన వారు కూడా దీపావళి జరుపుకుంటారు.

ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్షంలో దీపావళి పండుగను జరుపుకుంటారు. చెడుపై మంచిని గెలిచే రోజుగా, చీకటిని తరిమికొట్టే పండుగగా పండితులు దీపావళిని అభివర్ణిస్తారు.

దీపావళి నాడు దేశం మొత్తం వెలుగులతో నిండిపోతుంది. ప్రపంచం మొత్తంలో అని దేశాలలో కంటే ఈ పండుగ నాడు భారతదేశం వెలుగులతో నిండిపోతుంది.

దీపావళిని మొత్తం ఐదు రోజుల పండుగగా జరుపుకుంటారు. ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, గోవర్ధన పూజ , అన్నా చెల్లెల పండగగా సెలబ్రేట్ చేసుకుంటారు.

 importance of Diwali and results of worships
దీపావళి 2022: Diwali Puja Vidhanam

ఇంటిల్లపాది చేసుకునే ఈ దీపావళి నాడు కుటుంబం మొత్తం సంబరాలు  ఇంకా బాణసంచాలు కాలుస్తూ ఏంతో సంతోషిస్తారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అంతా సుఖసంతోషాలతో జీవించాలని ఆడవాళ్లు ప్రత్యేకమైన దీపాలను వెలిగిస్తారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించే పండుగ.

దీపావళి అర్థం దీపాల వరుస. ఈ పండుగ నాడు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఇంటిలో ఇంకా వ్యాపారం చేసే ప్రదేశాలలో దీపాలను వెలిగించి సంపద, అదృష్టం, శ్రేయస్సు కోసం ప్రత్యేకంగా పూజ చేస్తారు.

ప్రతి దీపావళి పండుగకు ముందు ఇంటిలో కీడు తొలగిపోవడానికి సానుకూల వాతావరణం వచ్చేలా ప్రజలు తమ ఇళ్ళను శుభ్రం చేసుకుని పండుగకు రెడీ అవుతారు.

 importance of Diwali and results of worships
Dhanteras 2022: దీపావళి 2022, Diwali Puja Vidhanam

దేశంలో ఒకో ప్రాంతంలో ఒకో రీతిగా ఈ పండుగ జరుగుద్ది. కొన్ని ప్రాంతాలలో ద్వాదశి, ఆవులను పూజించే రోజుతో పండుగ ప్రారంభమవుతుంది.

మరి కొన్ని చోట్ల ధన త్రయోదశితో ప్రారంభమవుతుంది. ధన త్రయోదశి పూజలు చేయడం వల్ల కుటుంబ సభ్యులు సంపద, ఆహారంతో పాటు మంచి ఆరోగ్యం పొందుతారని నమ్ముతారు. ఈ పండుగ నాడు కుబేరున్ని, లక్ష్మీదేవిని పూజిస్తారు.

దీపావళి 2022: ధన త్రయోదశి పండుగ రోజు

ధన త్రయోదశి పండుగ రోజు సంపదలకు దేవతగా, కుబేరునిగా, ఆరోగ్య దేవతగా భావించే ధన్వంతర ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ధన త్రయోదశి నాడు వెండి బంగారు, ఆభరణాలను పూజలో పెట్టి ధనలక్ష్మి అనుగ్రహం పొందేలా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు

ధన త్రయోదశి పండుగ నాడు శివుని అనుగ్రహం పొందుకోవటం కోసం ప్రదోష వ్రతాన్ని కూడా కొంతమంది ఆచరిస్తారు. ధన త్రయోదశి పండుగనాడు ఏ వస్తువు కొనుగోలు చేసిన శుభం కలుగుతుందని ఆ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని.. చాలామంది కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు.

 importance of Diwali and results of worships
Telugu women participating in the celebration of Dhanteras 2022: దీపావళి 2022, Diwali Puja Vidhanam
దీపావళి 2022: నరక చతుర్దశి

ఇక రెండో రోజు నాడు నరక చతుర్దశి జరుపుకుంటారు. లేదా చోటి దీపావళిగా పండుగగా జరుపుకుంటారు. నరక చతుర్దశి రోజు ప్రతి ఇంటి బయట ప్రత్యేక దీపం వెలిగిస్తారు. ఈ దీపం యొక్క విశిష్టత ఏమిటంటే నరకానికి సంబంధించిన అరిష్టాలు ఇంటిలో నుండి తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

ఇంకా ఇదే రోజు హనుమాన్ భక్తులు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఎందుకంటే నరక చతుర్ద నాడు హనుమాన్ జన్మించినట్లు నమ్ముతారు. ఈ క్రమంలో హనుమాన్ భక్తులు బ్రహ్మ ముహూర్తంలో అభ్యాంగ స్నానం అవలంబిస్తారు. ఈ రీతిగా చేయటం వల్ల ఆరోగ్యంతో పాటు అందం లభిస్తుందని వారి నమ్మకం.

దీపావళి 2022:

ఇక మూడో రోజు పండుగే అతిపెద్ద పండుగ..అదే దీపావళి. సరిగ్గా కార్తిక మాసంలో అమావాస్య తేదీ నాడు వచ్చే ఈ పండుగకి చాలావరకు వినాయక పూజతో పాటు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఈ విధమైన పూజలు చేయడం వల్ల ఇంట్లో సంపద ఇంకా ఆహార ధాన్యాల కొరత ఉండదని భక్తుల విశ్వాసం.

ఇక దీపావళి నాడు బెంగాలీ ప్రజలు కాళికాదేవికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఇళ్లల్లో దీపావళి ప్రత్యేక లడ్డూలు కూడా తయారు చేస్తారు.

ఇంకా వ్యాపారం చేసే వాళ్ళు తమ ఖాతా పుస్తకాలను మార్చుకుంటారు. అకాల మృత్యు దోషాలు తొలగిపోవడానికి పెద్ద ఎత్తున పూజలు చేస్తారు. ఇదే అతి పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఇదే రోజు కుబేరుడికి కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తారు.

దీపావళి 2022: గోవర్ధన పూజ

ఇక దీపావళి అనంతరం జరుపుకునే పండుగ గోవర్ధన పూజ. ఈ సమయంలో పాడ్యమి దీపాలు విడిచి పెట్టడం జరుగుద్ది. అంతేకాకుండా గోవర్ధన్ పర్వతం, ఆవు పూజకు చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు.

దీపావళి తర్వాత వచ్చే ఈ బలిపాడ్యమి పండుగనీ మహారాష్ట్ర ఇంకా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. మహారాష్ట్ర ప్రజలు బలి పాడ్యమి నాడు నవదివాస్ గా భావించడం జరుగుద్ది.

ఇంకా చివరి రోజు ఐదో రోజు అన్నా చెల్లెల పండుగ జరుపుకుంటారు. ఈ పండుగనాడు తమ సోదరుల  దీర్ఘాయువు కోసం సోదరీమణులు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఇదే సమయంలో సోదరులు తమ చెల్లెళ్లకు ప్రత్యేకమైన బహుమతి ఇచ్చి దీవించడం జరుగుద్ది.

Related posts

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju