Devatha: రుక్మిణి ఏడుస్తు ఏంటి పెనిమిటి బిడ్డ ఎక్కడికి వెళ్ళిందో ఇంకా కనిపించలేదు.. దేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఒక రోజు అయిపోయింది.. అయినా కానీ ఇంకా దేవి కనిపించలేదు అని రుక్మిణి బాధపడుతుంది.. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం.. నీ శత్రువులంతా మీ ఇంట్లోనే ఉన్నారు.. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా నీకు తెలుసు.. అయినా కానీ నువ్వు అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు రుక్మిణి ని అరుస్తాడు ఆదిత్య..
దేవుడమ్మ తన భర్త ఇద్దరు కలిసి రామ్మూర్తి వాళ్ళింటికి వెళ్తారు.. దేవి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తెలిసింది.. వెంటనే మమ్మల్ని పరామర్శించడానికి వద్దామని అనుకున్నాము.. మీరు దేవిని వెతుకుతూ ఉంటారు కదా అని రాలేదు అని దేవుడమ్మ అంటుంది.. దేవిని వెతికే పనిలో ఆదిత్య ఇంటికి కూడా రావడం లేదు.. పగలనకా రాత్రి దేవిని వెతకడంలోనే ఆదిత్య ఉన్నాడు అని దేవుడమ్మ చెబుతుంది..
రాదు కూడా దేవి కనిపించడం లేదు అని తెలిసిన మరుక్షణం నుంచి ఊరూరు తిరుగుతా వెతుకుతుంది.. ఇంతవరకు ఇంటికి రాలేదు అని రామ్మూర్తి అంటాడు.. ఒకపక్క జానకికి బాగోలేదు మరోపక్క దేవి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.. కష్టాలన్నీ మా ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లు ఉన్నాయి అని రామ్మూర్తి అంటాడు. ఇలాంటి సమయంలోనే మీరు ధైర్యంగా ఉండాలి.. అందరికీ ధైర్యం చెప్పాలి అని దేవుడమ్మ అంటుంది.. చిన్మయి ఏడుస్తూ దేవుడమ్మ అవ్వ దేవి ఇంకా కనిపించలేదు అని అంటుంది..
ఇద్దరు కలిసి స్కూల్ కి కలిసే వెళ్తారు కదా దేవి నీకు చెప్పకుండానే స్కూల్లో నుంచి వెళ్ళిపోయిందా అని దేవుడమ్మ అడుగుతుంది.. ఇద్దరం స్కూల్ కి కలిసే వెళ్ళాం అవ్వా.. కానీ మధ్యాహ్నం నుంచి స్కూల్లో నుంచి దేవి వెళ్ళిపోయింది.. అని చిన్మయి దేవుడమ్మ తో చెబుతుంది.. మాధవ్ మాత్రం దేవుడమ్మ ఏం మాట్లాడినా కూడా మౌనంగా ఉంటాడు.. మాధవ్ తో నువ్వే ఇప్పుడు ఇంట్లో అందరినీ చూసుకోవాలి.. జాగ్రత్తగా ఉండమని దేవుడమ్మ చెబుతుంది.. అలాగే అమ్మ అని అంటాడు మాధవ్..
దేవుడమ్మ ఇంటికి రాగానే ఆ మాధవిని చూసారా నాకు ఏదో అనుమానంగా ఉంది అండి అని వాళ్ళ ఆయనతో అంటుంది.. దేవికి మాధవ్ కన్న తండ్రి తనకి దేవి కనిపించడం లేదు అంటే ఎంత బాధ ఉండాలి.. కానీ మాధవ ముఖంలో ఎలాంటి బాధ లేదు చాలా ప్రశాంతంగా ఉన్నాడు.. బాధని చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది అని దేవుడమ్మ తన భర్తతో చెబుతున్న మాటలను సత్యా తన రూమ్లో నిలబడి వింటుంది.. మాధవ్ కూడా వెతుకుతున్నాడు అని సత్యా మనసులో అనుకుంటుంది.. ఆదిత్య రుక్మిణి ఇద్దరూ కావాలని బయట తిరగడానికి దేవుని ఒక వంకగా పెట్టుకున్నారు.. వీళ్లిద్దరి సంగతి చూడాలి ఏదో ఒకటి చేయాలి అని సత్య మనసులో అనుకుంటుంది..
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!