NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: పారిశ్రామికంగా ఏపిని అభివృద్ధి చేయడమే లక్ష్యమని పేర్కొన్న సీఎం వైఎస్ జగన్

YS Jagan:  రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలకు ఏ కష్టమొచ్చినా తాను అండగా ఉంటాననీ, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి వద్ద రూ.270 కోట్లతో నిర్మిస్తున్న అసాగో ఇండస్ట్రీస్ బయో ఇథనాల్ యూనిట్ కు సీఎం జగన్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ .. దేవుడి దయతో ఇవేళ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.

CM YS Jagan
CM YS Jagan

 

దావోస్ పర్యటనలో అనేక మంది పారిశ్రామిక వేత్తలను కలిశానని చెప్పారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు ఏపి లో మంచి వాతావరణం ఉందన్నారు. టెక్నాలజీకి సంబంధించిన మాటలు మాట్లాడుతున్న సమయంలో టెక్ మహేంద్రా గ్రూపు సీఇఓ సీపీ గుర్నానీ ఇథనాల్ కు సంబంధించి పరిశ్రమ గురించి అడిగారన్నారు. కేవలం ఆరు నెలల్లోనే భూములు ఇవ్వడం దగ్గర నుండి అన్ని అనుమతులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. దీంతో టెక్ మహేంద్రా గ్రూపు రూ.280 కోట్లతో ఈ ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తొందని చెప్పారు. ఈ ప్లాంట్ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. బ్రోకెన్ రైస్ తో ప్లాంట్ లో ఇథనాల్ తయారీ చేస్తారని చెప్పారు. ప్లాంట్ తో పాటు బై ప్రొడక్ట్ కింద పశువుల దాణా, చేపల మేతకు ఉపయోగపడే ప్రొటీన్ ఫీడ్ కూడా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. రంగు మారిన ధాన్యానికి కూడా మంచి ధర లభిస్తుందని సీఎం అన్నారు.

CM YS Jagan

ఈజ్ ఆఫ్ డూయింగ్ కు ఏపి ఒక ఉదాహరణగా నిలిచిందన్నారు. సీపీ గుర్నానీ ఇతర పారిశ్రామిక వేత్తల వద్ద కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తారని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో ఏలూరు కుడి కాల్వ నిర్మాణానికి సంబంధించి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. దీని వల్ల రైతాంగానికి మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్ మహేంద్ర సీఈఓ సీపీ గుర్నానీ, అశీష్, మంత్రులు గుడివాడ అమరనాథ్, తానేటి వనిత, దాడిశెట్టి రాజా, వేణుగోపాల కృష్ణ, ఎంపీలు భరత్ రామ్, అనురాధ, వంగా గీత, ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N