NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కేంద్రానికి సుప్రీం కోర్టు ఊహించని షాక్ .. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకాలపై సంచలన వ్యాఖ్యలు

కేంద్ర ఎన్నికల సంఘంలో సభ్యుల నియామకాల విషయంలో సుప్రీం కోర్టు కేంద్రానికి ఊహించని షాక్ ఇచ్చింది. ఎన్నికల సంఘం సభ్యుల నియామకాల తీరుపై అసహనం వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం కోసం కోలీజియం లాంటి వ్యవస్థ ను ఏర్పాటు చేయాలని కోరతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ కేఎం జోసఫ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 19న పదవీ విరమణ అయిన బ్యూరోక్రాట్ అరుణ్ గోయల్ ను కేంద్ర ఎన్నికల కమిషనర్ గా నియమించడంపై పలు సందేహాలను వ్యక్తం చేసింది. ఆయన నియామకానికి సంబంధించి దస్త్రాలను తమకు సమర్పించాలని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది.

Supreme Court

 

స్వచ్చంద పదవీ విరమణ ఇచ్చిన వెంటనే ఆయన (అరుణ్ గోయల్)ను ఎన్నికల విభాగానికి కమిషనర్ గా నియమించడంపై కేంద్రాన్ని ప్రశ్నించింది. గురువారం వరకూ సెక్రటరీ లెవల్ ఆఫీసర్ గా అరుణ్ గోయల్ ఉన్నారనీ, శుక్రవారం ఆయన వీఆర్ఎస్ తీసుకోగా, ఆ వెంటనే ఆయనను ఎన్నికల కమిషనర్ నియమించారని ప్రభుత్వ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ రాజ్యాంగ ధర్మాసనానికి వివరించారు. ఒక వేళ ఈసీగా ఆయనకు అవకాశం దక్కకపోయి ఉంటే డిసెంబర్ లో ఆయన పదవీ విరమణ అయ్యేవారిని తెలిపారు. ఈ సందర్భంలో కేంద్రం తరపున అటార్నీ జనరల్ వాదనలు వినిపిస్తూ.. కమిషనర్ నియామకం సక్రమంగా జరిగిందని చెప్పే ప్రయత్నం చేయగా ధర్మాసనం ఏజీ వాదనలను తోసిపుచ్చింది.

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని సీఈసీగా నియమిస్తున్నదంటూ బెంచ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీ ప్రభావం నుండి దూరంగా ఉండాలని, ప్రధాన ఎన్నికల అధికారి నియామక కమిటీలో సీజేఐను చేర్చాలని కేంద్రానికి సుప్రీం కోర్టు సూచించింది. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పని చేయాలనీ, ప్రధాని లాంటి వ్యక్తిపై ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకునేంత పారదర్శకత కమిషన్ సభ్యుల్లో ఉండాలని పేర్కొంది. ఒక పక్క సీఈసీ, ఈసీల నియామక పిటిషన్ పై కోర్టు విచారణ జరుగుతున్నప్పుడు కమిషనర్ నియామకం జరగకుండా ఉంటే మరింత సముచితంగా ఉండేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను రేపు కోర్టుకు సమర్పించాలని అటార్నీ జనరల్ కు ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ అరెస్టుపై హైకోర్టు ఏమన్నదంటే..?

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju