NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

రాహుల్ ‘జోడో’ యాత్రలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్

ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాజస్థాన్ లో కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుండి రాహుల్ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ఇప్పటి వరకూ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పూర్తి అయ్యింది. భారత్ జోడో యాత్రలో రాహుల్ వెంట పార్టీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రాహుల్ పాదయాత్ర ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. అనేక మంది ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు, మాజీ అధికారులు హక్కుల కార్యకర్తలు పాదయాత్రలో రాహుల్ గాంధీకి సంఘీ భావం తెలియజేస్తూ ఆయనతో కలిసి కొద్దిదూరం నడక సాగిస్తున్నారు. తాజాగా భారత్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ బుధవారం భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి నడిచారు.

Rahu Gandhi Bharat Jodo Yatra

 

రాజస్థాన్ లోని సవాయి మాధోపూర్ కు చెందిన భఢితి నుండి బుధవారం ఉదయం రాహుల్ పాదయాత్ర ప్రారంభమైంది. ట్విట్టర్ లో విడుదల అయిన వీడియోలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రాజన్, రాహుల్ గాంధీ, సచిన్ పైలట్ తో కలిసి నడుస్తూ కనిపించారు. రాహుల్ తో నడుస్తూనే పలు అంశాలను చర్చించారు రాజన్. గతంలో ఎన్డీఏ సర్కార్ నోట్ల రద్దును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిన సందర్భంలో రఘురామ్ రాజన్ కూడా మద్దతు ఇచ్చిన విషయం విదితమే. రాజన్ కూడా పలు మార్లు ఈ నోట్ల రద్దుపై బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇలాంటి నిర్ణయాలు వల్ల దీర్ఘకాల ప్రయోజనాలకు ఆటంకం కలుగుతుందని కూడా తను రాసిన ఓ పుస్తకంలో పేర్కొన్నారు రాజన్. భారత ఆర్ధిక వృద్ధి, ద్రవ్యలోటుపైనా ఆయన రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగ సంక్షోభాన్ని కప్పిపుచ్చుకోవాలనుకుంటే శ్రీలంక తరహా పరిస్థితులు తలెత్తుతాయని కూడా ఈ ఏడాది జరిగిన ఓ సదస్సులో ఆయన వ్యాఖ్యానించారు.

Former RBI Governor Raghuram Rajan joined the Padyatra with Rahul Gandhi

 

కాగా భారత్ జోడో యాత్ర ప్రారంభమై వంద రోజులు పూర్తి అవుతున్న సందర్బంగా శుక్రవారం నాడు జైపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సింగర్ సునిధి చౌహాన్ లైవ్ పర్ఫార్మెన్స్ కచేరీ నిర్వహిస్తున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ చెప్పారు. భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నందున రాహుల్ గాంధీ పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు దూరంగా ఉన్నారు.

కాంగ్రెస్ కు ఊహించని షాక్ ఇచ్చిన కేసిఆర్ సర్కార్ .. నేతలకు కొత్త తలనొప్పి.. వ్యూహకర్త కార్యాలయంలో పోలీసుల సోదాలు

Related posts

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N