NewsOrbit
సినిమా

మ‌రో నిజ ప్రేమ ఘ‌ట‌నా చిత్రం

 

నిజంగా జ‌రిగిన ప్రేమ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన `ఆర్‌.ఎక్స్ 100`తో హీరోగా స‌క్సెస్ అందుకున్నాడు కార్తికేయ‌. ఇప్పుడు ఇత‌ను రెండు చిత్రాల్లో న‌టిస్తున్నాడు. ఒక‌టి హిప్పీ.. కాగా కార్తికేయ తాజా చిత్రానికి `గుణ 369` అనే పేరును ఖ‌రారు చేశారు. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్ర‌మిది. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.
ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ “ఇంత‌కు ముందు ఒంగోలులో భారీ షెడ్యూల్ చేశాం. మ‌ళ్లీ ఈ నెల 29 నుంచి మే 15 వ‌ర‌కు మ‌రో భారీ షెడ్యూల్ చేయ‌బోతున్నాం. దాంతో ఒక సాంగ్ మిన‌హా సినిమా మొత్తం పూర్త‌వుతుంది. ఇప్పుడు హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో షూటింగ్ చేస్తున్నాం. మా చిత్రంలో హీరో పేరు గుణ‌. `369` అంటే ఏంట‌నేది స్క్రీన్ మీదే చూడాలి. ఇటీవ‌లే క్రొయేషియాలో 2 పాట‌లు తీశాం. ఔట్ పుట్ చాలా బాగా వ‌స్తోంది“ అని అన్నారు.
నిర్మాత‌లు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ “రియ‌ల్ ల‌వ్ ఇన్సిడెంట్స్ తో బోయ‌పాటి శిష్యుడైన అర్జున్ జంధ్యాల ఈ క‌థ‌ను అద్భుతంగా త‌యారు చేసుకున్నాడు. విన‌గానే చాలా ఇంప్రెస్ అయి వెంట‌నే ఓకే చెప్పేశాం. ల‌వ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ జోన‌ర్‌లో ఉంటుంది. క‌చ్చితంగా యువ‌త‌రాన్ని ఉర్రూత‌లూగించే విధంగా ఉంటుంది. హీరో కార్తికేయ కేర‌క్ట‌రైజేష‌న్ `ఆర్ ఎక్స్ 100`, `హిప్పీ` క‌న్నా చాలా విభిన్నంగా ఉంటుంది“ అని తెలిపారు.
హీరో కార్తికేయ మాట్లాడుతూ “కొన్ని క‌థ‌లు విన‌గానే న‌చ్చుతాయి. మ‌ళ్లీ మ‌ళ్లీ గుర్తుకొస్తుంటాయి. న‌లుగురితో పంచుకోవాల‌నిపిస్తుంటాయి. నాకు అర్జున్ జంధ్యాల చెప్పిన క‌థ అలాంటిదే. విన‌గానే న‌చ్చింది. బెస్ట్ స్టోరీ టు టెల్ అనిపించింది. ఇప్ప‌టిదాకా తీసిన‌ ర‌షెస్ చూసుకున్నాం. ప్ర‌తి ఫ్రేమూ రియ‌లిస్టిక్‌గా వ‌చ్చింది. రియ‌లిస్టిక్ చిత్ర‌మిది“ అని అన్నారు.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరద్వాజ్‌, కెమెరామెన్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ రామ్, ఆర్ట్‌ డైరెక్టర్‌ : జీయమ్‌ శేఖర్, ఎడిటర్ : తమ్మిరాజు , డాన్స్ : రఘు, ఫైట్స్ : రామకృష్ణ ,ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : శివ మల్లాల.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Leave a Comment