అక్కినేని నటించిన సక్సెస్ఫుల్ చిత్రాల్లో తెనాలి రామకృష్ణ ఒకటి. ఇందులో ఎన్టీఆర్ శ్రీకృష్ణ దేవరాయలుగా నటించడం విశేషం. కృష్ణదేవరాయలు కొలువులోని అష్టదిగ్గజాల్లో తెనాలి రామకృష్ణ ఒకరు. కాళి మాత్ర ప్రసాదించిన విద్యతో వికటకవిగా పేరుగాంచారు. ఆయన పాత్రను ఎ.ఎన్.ఆర్ వెండితెరపై తనదైన శైలిలో ఆవిష్కరించారు. అయితే ఇప్పుడు అభినవ తెనాలి రామకృష్ణుడు ఎలా ఉంటాడో చెప్పబోతున్నాడు సందీప్ కిషన్. ఈ కుర్ర హీరో తెలుగు, తమిళంలో నటిస్తోన్న చిత్రం `తెనాలి రామకృష్ణ బి.ఎ, బి.ఎల్`. మరి నేటి తెనాలి రామకృష్ణ లాయర్‌గా ఏం చేయబోతున్నాడో తెలసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నాడు దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి.
హన్సిక నాయికగా నటిస్తున్న ఈ చిత్రం పూర్తిస్థాయి వినోదాత్మకంగా రూపొందుతోంది. 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిస్తోన్న స్ట్రయిట్ తెలుగు సినిమా ఇది. మురళీ శర్మ, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సాయికార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నారు. సాయి శ్రీరామ్ ఈ చిత్రానికి కెమెరామేన్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ పతాకంపై తెలుగు, తమిళ భాషల్లో ఏక సమయంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!