NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ సీఎం జగన్ పనితీరు ప్రశంసించిన జేఎస్‌డబ్ల్యు గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పనితీరును ప్రముఖ జెఎస్‌డబ్ల్యు గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్ వంటి యువ, డైనమిక్ సీఎం ఉండటం అదృష్టమని అన్నారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి లో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించిన సందర్భంగా జరిగిన సభలో సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ ఏపిలోని కడప జిల్లాలో తమ గ్రూప్ నకు చెందిన స్టీల్ ప్లాంట్ భూమి పూజకు హజరుకావడం ఎంతో సంతోషంగా ఉందన్న్నారు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రజలతో పాటు, జిల్లా వాసుల చిరకాల వాంఛ అని అన్నారు. ఈ ప్లాంట్ కోసం సీఎం జడగన్ ఎంతో అంకితభావం, చిత్తశుద్దితో కృషి చేశారన్నారు. తమను నిరంతరం సంప్రదింపులు జరిపారనీ, ఆయన చొరవ, ప్రయత్నం వల్లనే ఇవేళ ఈ ప్రాజెక్టుకు కార్యరూపం దాలుస్తొందని అన్నారు. ఇది వైఎస్ఆర్ జిల్లా, ఇక్కడ ఇవేళ ఆయన (జగన్) తల్చుకోకుండా ఉండి ఉంటే ఈ కార్యక్రమం అసంపూర్తిగా ఉండే పోయేదన్నారు.

Sajjan Jindal

 

దివంగత సీఎం వైఎస్ఆర్ తనకు వ్యక్తిగత మిత్రుడు అని, ఆయనను ఎప్పుడు కలిసినా, మాట్లాడినా తనకు ఎంతో సంతోషంగా ఉండేదని చెప్పారు. వైఎస్ఆర్ తనకు ఒక మార్గదర్శకుడిగా ఉండే వారన్నారు. వైఎస్ జగన్ కూడా తనకు సుదీర్గకాలంగా తెలుసునని తెలిపారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో సొంత ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తొందని అన్నారు. తండ్రి రాజశేఖరరెడ్డి బాటలోనే తనయుడు జగన్ పయనిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు సజ్జన్ జిందాల్. తాను దేశంలో అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ అనేక మంది ముఖ్యమంత్రులను కలిశాననీ, అందరూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ప్రస్తావిస్తుంటారనీ, ఆయన నాయకత్వం, పరిపాలన దక్షత గురించి చెబుతుంటారన్నారు. అందుకు రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుండటమేననీ, గత మూడేళ్లుగా రాష్ట్ర జీడీపీ చాలా వేగంగా పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఆయన (జగన్) నిరంతరం శ్రమిస్తున్నారని ప్రశంసించారు.

CM Jagan performed Bhumi Pooja for Kadapa Steel Plant in YSR district

 

ఇంతకు ముందు సీఎం జగన్ ను కలిసినప్పుడు అప్పుడు ఆయన బిజీగా ఉండటం వల్ల ఎక్కువ సేవు మాట్లాడలేకపోయాననీ, అయినప్పటికీ ఆ సమయంలో కూడా రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం, వివిధ రంగాల్లో అమలు చేస్తున్న సంస్కరణలు ఇలా అన్ని విషయాలు వివరించి వీటి వల్ల రాష్ట్రం ఎలా మారుతోంది అన్న విషయాలను ప్రస్తావించారని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలనీ, అందరూ సంతోషంగా ఉండాలనీ,  రాష్ట్రం అన్ని విధాలుగా ఇంకా అభివృద్ధి చెందాలన్నది తన ఆకాంక్షగా జగన్ చెప్పిన మాటలు వింటుంటే తనకు ఎంతో ఆశ్చర్యం కల్గించాయన్నారు. బళ్లారిలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం తాను తొలిసారి 1995లో అక్కడికి వెళ్లాననీ, అప్పుడు అక్కడ 1.2 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్‌ నిర్మాణం మొదలు పెట్టగా, మొక్కలా మొదలైన ఆ ప్లాంట్‌ ఇవాళ ఒక మహావృక్షంలా ఎదిగిందన్నారు.

CM Jagan performed Bhumi Pooja for Kadapa Steel Plant in YSR district

 

ఇవాళ ఆ ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యం 13 మిలియన్‌ టన్నులకు చేరిందనీ, వచ్చే మూడేళ్లలో ఆ ప్లాంట్‌ ప్రపంచంలోనే అతి పెద్ద ప్లాంట్‌గా అవతరించబోతోందని చెప్పారు, అప్పటికి ఆ ప్లాంట్‌ సామర్థ్యం 25 మిలియన్‌ టన్నులకు చేరుతుందన్నారు. ఇవాళ ఇక్కడ కూడా ఆనాటి మాదిరిగానే అంతే సామర్థ్యంతో ప్లాంట్‌ను మొదలు పెడుతున్నాము  కాబట్టి ఇది కూడా అలాగే ఎదుగుతుందన్న ధీమా వ్యక్తం చేశారు.  ఇవాళ తాము ఇక్కడ భూమి పూజ చేస్తోంది కేవలం ఒక స్టీల్‌ ప్లాంట్‌ కోసం మాత్రమే కాదనీ, ఇది జిల్లా అభివృద్ధి కోసం చేస్తున్న భూమి పూజగా అభివర్ణించారు జిందాల్. ఈ స్టీల్‌ ప్లాంట్‌ వల్ల ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందనీ,  దేశవ్యాప్తంగా ఇది ప్రత్యేక గుర్తింపు పొందుతుందని తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లా చంద్రబాబు పర్యటనలో అపశృతి

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju