NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ .. తొలి రోజు కార్యక్రమాలు ఇలా..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు విశాఖ ముస్తాబైంది. నేటి నుండి రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్ పారిశ్రామిక వర్గాల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. అతిధులకు ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల విస్తరణ, నూతన పరిశ్రమల ఏర్పాటునకు దిగ్గజ కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఏపి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకునేందుకు పరిశ్రమలు సిద్దమవుతున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జడగన్ సమక్షంలో విశాఖ వేదికగా జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కీలక ఎంవోయులకు వేదికగా నిలవనున్నది.

global investors summit 2023

 

కాగా జడీఇఎస్ లో తొలి కార్యక్రమాలు ఇలా జరగనున్నాయి. ఉదయం 9.45 గంటలకు అతిధుల ఆహ్వానం, పరిచయ కార్యక్రమంతో సదస్సు ప్రారంభం అవుతుంది. రేజర్ షో, మా తెలుగు తల్లికి.. గీతాలాపన, జ్యోతి ప్రజ్వలన, అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎన్ జవహర్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తారు. ఆ తర్వాత ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఉంటుంది. అనంతరం నాఫ్ సీఈఓ సమిత్ బిదానీ, భారత్ ఎఫ్ఐహెచ్ లిమిటెడ్ కంట్రీ హెడ్ అండ్ ఎఁడీ జోష్ ఫాల్గర్, టోరే ఇండస్ట్రీస్ (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ ఎండీ మనహీరో హమగుచి. కియా ఇండియా నుండి కచ్ డోంగీ లీ, ది ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ వైస్ చైర్మన్ అండ్ ఎండీ ఎన్ శ్రీనివాసన్, జేఎన్ డబ్ల్యు గ్రూప్ చైర్మన్ సజన్ జిందాల్ ప్రంగిస్తారు. తదుపరి ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ తర్వాత అపోలో హాస్పటల్స్ వైస్ చైర్ పర్సన్ ప్రీతిరెడ్డి, శ్రీ సిమెంట్ చైర్మన్ హరి మోహన్ బంగూర్, సెంచురీ ప్లైబోర్డ్స్ చైర్మన్ సజ్జన్ భజంకా, టెస్లా ఇంక్ కో ఫౌండర్ అండ్ మాజీ సీఈఓ  మార్టిన్ ఎబన్ హార్డ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ చైర్మన్ నవీన్ జిందాల్ ప్రసంగిస్తారు.

global investors summit 2023

 

అనంతరం ఆడియో విజువల్ ప్రజెంటేషన్, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జిఎం రావు, సయింట్ ఫౌండర్ చైర్మన్ బీవీ మోహన్ రెడ్డి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎం ఎల్లా, దార్మియా భారత్ గ్రూప్ ఎండీ పునీత్ దాల్మియా, రెనూ పవర్ సీఎండీ సుమంత్ సిన్హా ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఉంటుంది. తదుపరి ఒబెరాయి గ్రూప్ ఎగ్జిక్యుటివ్ చైర్మన్ అర్జున్ ఒబెరాయ్, సీఐఐ అధ్యక్షుడు సంజీవ్ బజాజ్, ఆదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ లిమిటెడ్ సీఇఓ కరణ్ అదాని, అదిత్య బిర్లా గ్రుప్ చైర్మన్ కేఎం బిర్లా, రిలయన్స్ ఇంటస్ట్రీస్ సీఎండీ ముఖేష్ అంబాని ప్రసంగిస్తారు. తదుపరి ఎంఓయు కార్యక్రమం ప్రారంభం అవుతుంది.

#image_title

అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ప్రముఖులను సీఎం సత్కరిస్తారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ కరికాల వలవన్ వందన సమర్పణ చేస్తారు. అనంతరం ఎగ్జిబిషన్ ప్రారంభం కానున్నది.  మధ్యాహ్నం 3 గంటలకు నుండి నాలుగు ఆడిటోరియాల్లో వివిధ విభాగాలకు సంబంధించి సెషన్స్ జరగనున్నాయి. సాయంత్రం 6గంటలకు కూచిపూడి కళా ప్రదర్శన, 8 గంటలకు డ్రోన్ షోతో తొలి రోజు సదస్సు ముగుస్తుంది. కాగా విఐపీలు, వీవీఐపీలు విశాఖకు తరలిరావడంతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టింది పోలీసు యంత్రాంగం, దాదాపు 2500 మందితో భద్రత కల్పిస్తున్నారు.

గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కు విశాఖలో సర్వం సిద్ధం .. జనసేన అధినేత పవన్ ఆసక్తికర ట్వీట్

global investors summit 2023

 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju