NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపిలో ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

తమ డిమాండ్ ల సాధనకు ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్దపడుతున్న వేళ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెలాఖరులోగా బకాయిలు అన్నీ చెల్లిస్తామని మంత్రివర్గ ఉప సంఘం ప్రకటించింది. మంత్రి వర్గ ఉప సంఘంతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపి ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

sajjala Ramakrishna Reddy

అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మార్చి నెలాఖరు నాటికి ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న రూ.3వేల కోట్ల బకాయిలను చెల్లిస్తామని ప్రకటించారు. కోవిడ్ కారణంగా రాష్ట్ర ఆదాయం తీవ్రంగా దెబ్బతిన్నదనీ, అందుకే ఉద్యోగులకు చెల్లించలేకపోయామని వివరణ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలపై రెండు మెట్లు దిగే చర్చలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఉద్యోగులకు ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తాపత్రయపడుతూనే ఉంటుందని చెప్పారు. చిన్న చిన్న సమస్యలను ఉద్యోగులు – ప్రభుత్వం కలిసి పరిష్కరించుకుంటాయని తెలిపారు. ఈ రోజు నిర్వహించిన చర్చల్లో కొన్ని అంశాలు పరిష్కారం అయ్యాయనీ, మరికొన్ని త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు.

మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపినట్లు చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ అంశాలను ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని సీఎం జగన్ చెప్పారని మంత్రి వెల్లడించారు. వారి పెండింగ్ అంశాలను తెలుసుకునేందుకు ఉద్యోగ సంఘాలతో సమావేశం అయినట్లు తెలిపారు. పీఎఫ్ పెండింగ్ బిల్లులు అన్నీ ఈ నెలాఖరులోగా క్లీయర్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఉద్యోగ  సంఘాలు తమ దృష్టికి తీసుకువచ్చిన అంశాలపై సంతృప్తి కలిగేలా నిర్ణయం ఉంటుందన్నారు. శాశ్వత విత్ డ్రా, తాత్కాలిక పీఎఫ్ రుణాల బిల్లులనీన చెల్లించనున్నట్లు తెలిపారు.

మెడికల్, ఈ హెచ్ ఎస్ బిల్లులన్నీ ఈ నెలలోనే బేషరతుగా చెల్లిస్తామని చెప్పారు. టీఏ, జీఎల్ఇ బిల్లులనూ ఈ నెలలోనే చెల్లిస్తామని తెలిపారు. ఇకపై మంత్రుల కమిటీ తరచుగా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తుందని మంత్రి సురేష్ పేర్కొన్నారు. అయితే సమావేశం అనంతరం ఏపీ జేఏసి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ ఉద్యోగ కార్యచరణ యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు. త్వరలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించి ఉద్యమ కార్యచరణ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Political Survey: బాబు ఇలాకాలో జగన్ హవా .. తాజాగా వచ్చిన సర్వేలోనూ అదే లెక్క..!

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju