NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Viveka Case: మరోసారి హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ అవినాష్ రెడ్డి.. భాస్కరరెడ్డి పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా

YS Viveka Case: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరో సారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాను వేసిన పిటిషన్ లో మధ్యంతర దరఖాస్తు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 14న సీబీఐ జరిపిన విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డును ఇవ్వాలని కోర్టును కోరారు అవినాష్ రెడ్డి. వివేకా హత్య కేసులో ఇటీవల అవినాష్ రెడ్డిని పలు మార్లు విచారించింది. ఇప్పటి వరకూ నాలుగు సార్లు సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హజరైయ్యారు. అయితే హత్య కేసులో విచారణకు హజరు కాకుండా మినహాయింపు కోసం అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, ఆయన వినతిని కోర్టు నిరాకరించింది. అయితే తీర్పు వెలువరించే వరకూ పిటిషనర్ ను అరెస్టు చేయవద్దని సీబీఐని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Telangana High Court

 

మరో వైపు ఈ కేసుకు సంబంధించి వైఎస్ భాస్కరరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఇవేళ హైకోర్టులో విచారణ జరిగింది. వివేకా హత్య కేసులో నాల్గవ నిందితుడు దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడాన్ని ఆయన సవాల్ చేశారు. ఇదే అంశంపై వివేకా పీఏ కృష్ణారెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లు కలిపి ధర్మాసనం విచారించింది. దస్తగిరి స్టేట్ మెంట్ ఆధారంగానే సీబీఐ విచారణ జరుపుతోందనీ, నిందితుడు ఇచ్చిన వ్యాంగ్మూలం ఆధారంగా తమను నేరంలోకి నెట్టడం సమంజసం కాదని భాస్కరరెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్మెంట్ ఇస్తున్నారని భాస్కరరెడ్డి ఆరోపించారు.

హత్య లో కీలక పాత్ర పోషించిన దస్తగిరికి బెయిల్ ఇవ్వడం సరికాదని, హత్య ఆయుధాన్ని కొనుగోలు చేసింది దస్తగిరి బెయిల్ సమయంలోను సీబీఐ సహకరించిందని చెప్పారు. దస్తగిరిపై ఉన్న ఆధారాలను కింది కోర్టు పట్టించుకోలేదని అన్నారు. దస్తగిరికి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని బాస్కరరెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ను మాత్రమే పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేపట్టిందని, ప్రత్యక్ష సాక్షి రంగన్న స్టేట్ మెంట్ ను మాత్రం పరిగణలోకి తీసుకోలేదని పిటిషన్ తరపు న్యాయవాది ప్రకాశ్ రెడ్డి కోర్టుకు తెలియజేశారు. కనీసం సీసీ పుటేజ్ ను కూడా సీబీఐ పరిశీలించలేదని హైకోర్టుకు తెలిపారు. దీనిపై రేపు వాదనలు కొనసాగనున్నాయి.

విచారణకు హజరు కావాలని నోటీసులు ఇచ్చిన పోలీసులు .. పోలీసులపై బీజేపీ రాష్ట్ర నేత బండి సంజయ్ ఫైర్

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N