బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ జూన్ 5న `భారత్` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం తర్వాత సల్మాన్ `వెటరన్` అనే సినిమా చేస్తాడని సమాచారం. రొటీన్‌కు భిన్నంగా ఎక్స్పెరిమెంట్ మూవీ ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రం కొరియన్ మూవీ ఆధారంగా రూపొందనుంది. ఆసక్తికరమైన విషయమేమంటే ఇందులో సల్మాన్‌కు హీరోయిన్ ఉండదు. హీరోయిన్ ఉంటే అసలు స్క్రిప్ట్ పక్కకు వెళ్లిపోతుంది కాబట్టి, సల్మాన్ కూడా హీరోయిన్ లేకుండానే నటించడానికి ఓకే అన్నాడట. కాస్త వయసు మళ్లిన వ్యక్తి మోస్ట్ వాంటెడ్ యువకుడి కోసం వెతకడమే ఈ సినిమా కథాంశంగా కనపడుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కబోయే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మిస్తాడట. దర్శకుడు ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
previous post
next post
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!