NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

TS High Court: తెలంగాణ సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురు .. గ్రూప్ – 1 ప్రిలిమ్స్ రద్దుపై సింగిల్ బెంచ్ తీర్పును సమర్ధించిన హైకోర్టు డివిజన్ బెంచ్

TS High Court: తెలంగాణ సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఏపీపీఎస్సీ గ్రూప్ – 1 ప్రిలిమ్స్ రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్ధించింది. గ్రూప్ -1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్ ను డివిజన్ బెంచ్ డిస్మిస్ చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)  నిర్వహించిన గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పరీక్ష ను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ కోర్టు కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.

జూన్ 11న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షలకు 2.32 లక్షల మందికపైగా అభ్యర్ధులు హజరైయ్యారు. మొత్తం 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కొరకు పరీక్ష జరిగింది. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని హైకోర్టుకు పలువురు అభ్యర్ధులు పిటిషన్ లు దాఖలు చేశారు. పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని అభ్యర్ధులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అభ్యర్ధుల పిటిషన్లను పరిగణలోకి తీసుకుని విచారించిన హైకోర్టు గత వారం  తీర్పు వెలువరించింది.

పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్ 1 పరీక్ష ఇంతకు ముందు ఓ సారి రద్దైన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పు కారణంగా మరో సారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు కావడంతో టీఎస్పీఎస్సీ న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపి హైకోర్టు డివిజన్ బెంచ్ లో రిట్ అప్పీల్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం విచారణ సమయంలో టీఎస్పీఎస్సీపై ప్రశ్నల వర్షం కురిపించింది. “ప్రశ్న పత్రాల లీకేజీ తో ఒక సారి గ్రూప్ 1 పరీక్ష ను రద్దు చేసి మరో సిర నిర్వహిస్తున్నప్పుడూ మళ్లీ అదే నిర్లక్ష్యమా..? గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోరా? బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొని దాన్ని ఎందుకు అమలు చేయలేదు..? మీ నోటిఫికేషన్ లోని నిబంధనలను మీరే ఉల్లంఘిస్తారా ..? అలా ఎందుకు జరిగింది..? లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. వారి ఆశలను నీరుగారుస్తారా? అంటూ హైకోర్టు టీఎస్పీఎస్సీపై ప్రశ్నల వర్షం కురిపించింది. నిన్న, ఇవేళ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ..సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్దించింది. ప్రిలిమ్స్ పరీక్ష రద్దు సబబేనని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ చేసిన అప్పీల్ ను ఉన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.

AP High Court: జడ్జిలపై దూషణ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు .. టీడీపీ నేత బుద్దా వెంకన్న సహా 26 మందికి నోటీసులు

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?