NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Vangaveeti Radha: విజయవాడలో అట్టహాసంగా వంగవీటి రాధా వివాహం .. హజరైన పవన్ కళ్యాణ్

Vangaveeti Radha:  దివంగత నేత వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వివాహం ఘనంగా జరిగింది. నరసాపురంకు చెందిన జక్కం బాబ్జీ, అమ్మాణిల కుమార్తె పుష్పవల్లి తో రాధా వివాహం విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్ నందు అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ వివాహానికి అనేక మంది ప్రముఖులు, రాజకీయాలకు అతీతంగా నేతలు, ప్రజాప్రతినిధులు హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం రాధ వివాహ వేడుకకు హజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

వంగవీటి రాధాతో పవన్ కళ్యాణ్ ముచ్చటిస్తున్న ఫోటోలను జనసేన తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసి .. రాధాకు శుభాకాంక్షలు తెలిపింది. “విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ వంగవీటి రాధాకృష్ణ వివాహ వేడుకకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. ఆదివారం రాత్రి విజయవాడ, పోరంకిలోని మురళీ రిసార్ట్స్ లో జరిగిన ఈ వేడుకకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు హాజరయ్యారు. నూతన వధూవరులు వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లిలకు శుభాకాంక్షలు తెలిపారు”

రాధా పుష్పవల్లి వివాహ నిశ్చితార్ధం ఆగస్టు నెలలో జరిగిన సంగతి తెలిసిందే. పుష్పవల్లి తల్లిదండ్రులు రాజకీయ నేతలు కావడం గమనార్హం. ఏలూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ జక్కం అమ్మాణి, బాబ్జీ దంపతుల కుమార్తె పుష్పవల్లి. వీరు ప్రస్తుతం జనసేనలో యాక్టివ్ గా పని చేస్తున్నారు. గోదావరి జిల్లాలో జరిగిన వారాహి యాత్ర సందర్భంగా నరసాపురంలోని జక్కం బాబ్జీ ఇంట్లో పవన్ కళ్యాణ్ బస చేశారు. ఆ సమయంలోనే రాధా పెళ్లి విషయంపై పెద్దలతో మాట్లాడినట్లుగా ప్రచారం జరిగింది. వంగవీటి రాధాకృష్ణ ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నా రాజకీయాలకు అతీతంగా స్నేహితులు ఉన్నారు. అయితే రాధా జనసేనలోకి వెళ్తారనే ప్రచారం కొద్ది నెలల క్రితం జరిగింది.

కానీ నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగిన సమయంలో రాధ పాల్గొని లోకేష్ కు స్వాగతం పలికారు. కొద్ది దూరం లోకేష్ తో పాటు నడిచారు. దీంతో ఆ వార్తలకు తెరపడినట్లు అయ్యింది. గత ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీమానా చేసి టీడీపీలో చేరిన రాధా .. 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున తొలిసారిగా 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన రాధా.. ఆ తర్వాత రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నప్పటికీ మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయారు. ఇప్పటికే టీడీపీ – జనసేన పొత్తు ఖరారు అయిన నేపథ్యంలో రాధా పార్టీ మారాల్సిన పని లేకుండానే ఉమ్మడి అభ్యర్ధిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయన్నారని అంటున్నారు. ఆయితే ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు అనే దానిపై క్లారిటీ లేదు.

Chandrababu Letter: రాజమండ్రి సెంట్రల్ జైల్ నుండి చంద్రబాబు పేరుతో బహిరంగ లేఖ .. లేఖపై జైల్ సూపర్నిటెండెంట్ వివరణ ఇదీ

Related posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?