NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP Vs TDP – Janasena: వైసీపీ వర్సెస్ టీడీపీ – జనసేన కూటమి .. ఏ జిల్లాలో ఎవరికి ఎన్ని సీట్లు అంటే..?

YSRCP Vs TDP – Janasena: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మరో సారి విజయం సాధించి తన పాలనను సుస్ధిరం చేసుకోవాలన్న లక్ష్యంలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రకరకాల వ్యూహాలను రచిస్తున్నారు. అధికార వైసీపీని ఎలాగైనా గద్దె దింపి తాము అధికారంలోకి రావాలని టీడీపీ – జనసేన కూటమి ప్రతి వ్యూహాలతో సిద్దం అవుతోంది. ఆయా పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వరుస భేటీలు జరుపుతూ రాజకీయ వ్యూహాలపై చర్చిస్తున్నారు. మరో మూడు నాలుగు నెలల్లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో ప్రధాన రాజకీయ పక్షాలు అభ్యర్ధుల ఎంపికపై దృష్టి పెట్టాయి. దీంతో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో తన కంటూ ఒక ఓటు బ్యాంక్ ను సుస్ధిరం చేసుకున్న వైసీపీ గెలుపు ధీమాతో ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందన్న ఆశతో జనసేన – టీడీపీ కూటమి ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే దానిపై సామాన్యుల నుండి రాజకీయ నాయకుల వరకూ అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఓ ప్రముఖ సర్వే సంస్థ ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఏయే జిల్లాల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి..? అధికారం ఎవరిదో అంచనా వేస్తూ రిపోర్టును విడుదల చేయడం జరిగింది.

ఆ సర్వే సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా శాంపిల్స్ తో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రజల అభిప్రాయాలను సేకరించినట్లుగా తెలుస్తొంది. ఆ సర్వే ఆధారంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది అంచనా వేసింది. ఆ లెక్కల ప్రకారం ఏపీలో వైసీపీకి 50.10 శాతం, టీడీపీ – జనసేన కూటమికి 43.12 శాతం, ఇక మిగిలిన 4.70 శాతం హోరాహోరీగా ఉండే అవకాశం ఉందని తేల్చింది. ఆ అంచనా బట్టి చూస్తే వైసీపీకి 110కిపైగా స్థానాల్లో, 46కుపైగా స్థానాల్లో టీడీపీ – జనసేన కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్పిందట.

YSRCP

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చూసుకున్నట్లయితే ..శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వైసీపీ 4, టీడీపీ జనసేన కూటమికి 3, విజయనగరంలో వైసీపీకి 4, టీడీపీ – జనసేన కూటమికి 1, అరకులో వైసీపీకి 6, టీడీపీకి 1, విశాఖపట్నంలో వైసీపీకి 4, టీడీపీ జనసేన కూటమికి 2, అనకాపల్లిలో వైసీపీకి 4, టీడీపీ జనసేనకు 2, రాజమండ్రిలో వైసీపీకి 3, టీడీపీ జనసేన కూటమికి 4, కాకినాడలో వైసీపీ కి 4, టీడీపీ, జనసేన కూటమికి 2 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

అమలాపురంలో వైసీపీకి5, టీడీపీ – జనసేన కూటమికి 1, నరసాపురంలో వైసీపీకి 1, టీడీపీ – జనసేనకు 5, ఏలూరులో వైసీపీకి 5, టీడీపీ – జనసేనకు 2, మచిలీపట్నంలో వైసీపీకి 4, టీడీపీ – జనసేనకు 3, విజయవాడలో వైసీపీకి4, టీడీపీ – జనసేనకు 2, గుంటూరులో వైసీపీకి 3, టీడీపీ – జనసేనకు 3, నరసరావుపేట లో వైసీపీకి 6, టీడీపీ – జనసేనకు 1, బాపట్లలో వైసీపీకి 3, టీడీపీ – జనసేనకు 3, ఒంగోలులో వైసీపీకి 4, టీడీపీ – జనసేనకు 3, నెల్లూరులో వైసీపీకి 5, టీడీపీ – జనసేనకు 1, కర్నులులో వైసీపీకి6, టీడీపీ – జనసేనకు 1, నంద్యాలలో వైసీపీకి 6, టీడీపి – జనసేనకు 1, తిరుపతిలో వైసీపీకి 4, టీడీపీ –జనసేనకు 1, చిత్తూరులో వైసీపీకి 4, టీడీపీకి 1, అనంతపూర్ లో వైసీపీకి 4, టీడీపీ –జనసేనకు 2, హిందూపూర్ లో వైసీపీకి 5, టీడీపీ – జనసేనకు 2, రాజంపేటలో వైసీపీకి 7, కడప లో వైసీపీకి ఏడు స్థానాలు వచ్చాయని అంచనా వేసింది. అయితే పలు సర్వే సంస్థలు వివిధ రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఫలితాలను వెల్లడి చేస్తుండటంతో ఏ ఫలితాలు నిజమైనవో తెలియక ప్రజలు తికమకపడుతున్నారు.

Covid Subvariant JN.1: మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు .. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?