NewsOrbit
Entertainment News Telugu TV Serials

 Nindu Noorella Saavasam December 19 2023 Episode 110: అమరేంద్ర భాగమతి ఒకటే గదిలో ఉండడం చూసిన అరుంధతి టెన్షన్..

Nindu Noorella Saavasam Today Episode December 19 2023 Episode 110 Highlights

Nindu Noorella Saavasam December 19 2023 Episode 110:  రాథోడ్ తాళాలు కోసం ఇల్లు అంతా వెతుకుతాడు కానీ తాళాలు కనిపించలేదు.మేడం సార్ మనోహరి గారు అందరూ రండి అని కంగారు పడుతూ పిలుస్తాడు రాథోడ్. ఏమైంది రాథోడ్ అని శివరామ్ అంటాడు. అమరేంద్ర గారు ఉన్న గదికి డోర్ లాక్ అయిపోయింది ఆ గదిలో మిస్సమ్మ కూడా ఉంది తాళం ఎక్కడ ఉంది వెతకండి సార్ అని అంటాడు రాథోడ్. అందరూ కబోర్డ్ లు రూములు అన్ని వెతుకుతారు కానీ తాళం దొరకదు. తాళాలు దొరకట్లేదు మన ఇంటి తాళాలు అరుంధతికి తప్ప ఇంకెవరికి తెలియవు అని శివరామ్ అంటాడు.ఏంటే ఆ మిస్సమ్మకి అన్ని ఇలా కలిసి వస్తున్నాయి  అమరేంద్ర తను ఒకటే గదిలో ఉంటే డోర్ లాక్ అయిపోవడం ఏంటి ఏం జరుగుతుందో అసలు అని మనోహరీ అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode December 19 2023 Episode 110 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 19 2023 Episode 110 Highlights

మామయ్య గారు ఆ తాళాలు నా రూమ్ లో కబోర్డ్ లో ఉన్నాయి అని అరుంధతి చెప్తుంది. అయ్యో నా మాట వాళ్ళకి వినిపించదు కదా ఏం చేయాలి అని గుప్తా దగ్గరికి పరిగెత్తుకెళ్తుంది అరుంధతి.కట్ చేస్తే, గుప్తా గారు మా ఆయన ఉన్న గదికి లాక్ అయిపోయింది తాళం నా గదిలో ఉందని వెళ్లి చెప్పు అని అరుంధతి అంటుంది. ఆ బాలిక మనిద్దరం మాట్లాడుకున్నది చూసి ఇంట్లో ఎవరికైనా చెప్పుతుందేమోనని టెన్షన్ పడుతున్నాను నువ్వేంటమ్మా ఈ గోల అని గుప్తా అంటాడు. నీలా ఎవరికీ చెప్పట్లేదు కానీ తాళం గురించి వెళ్లి చెప్పు అని అరుంధతి అంటుంది. అలాగే చెప్తాను అని గుప్తా గారు కొంచెం ముందుకు వెళ్లి మళ్లీ ఆగుతాడు. ఏమైంది గుప్తా వెళ్లి చెప్పు అంటుంది అరుంధతి. ఇప్పుడు నేను వెళ్లి చెప్పినచో నీకు ఎవరు చెప్పారు అని నన్ను నిలదీస్తారు నేను వెళ్లి చెప్పను అని గుప్తా అంటాడు. దూరదృష్టితో ఆలోచించి చెప్పానని చెప్పు అని అరుంధతి అంటుంది. దూర దృష్టితో చెప్పవలెనన్న నా ఉంగరము ఇచ్చినచో నేను చెప్పేదను అని గుప్తా అంటాడు. ఏంటండీ ప్రతిదీ ఉంగరానికి లింకు పెడతారు నా దగ్గర ఆ ఉంగరం లేదు మీరు వెళ్లి చెప్పండి అని అరుంధతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode December 19 2023 Episode 110 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 19 2023 Episode 110 Highlights

నేను చెప్పను గాక చెప్పను అని గుప్త అక్కడే నిలబడతాడు. అరుంధతి కూడా అలాగే నిలబడి చూస్తుంది. గుప్తా గారు మా ఆయన మిస్సమ్మ ఒకే గదిలో ఉన్నారు వెళ్లి చెప్పు అని అంటుంది అరుంధతి. నీ పతి దేవుని మీద ఆమాత్రం నమ్మకం లేదా అని గుప్తా అంటాడు. ఆయన శ్రీరామచంద్రుడు మనుషుల్లో ఉత్తముడు అని అరుంధతి అంటుంది. మరి ఎందులకు చింతించుచుంటివి అని గుప్తా అంటాడు. అంటే మిస్సమ్మ కూడా అదే గదిలో ఉంది కదా భయపడుతుందని అలా అన్నాను అని అరుంధతి అంటుంది. నువ్వు నాకు ఉంగరం ఇస్తేనే నేను చెప్పేదను అని గుప్తా తెగేసి చెప్తాడు. అరుంధతి మళ్లీ అమరేంద్ర రూమ్ దగ్గరికి వెళుతుంది. కట్ చేస్తే, సార్ డోర్ తాళాలు ఎక్కడ దొరకలేదు అని రాథోడ్ అంటాడు. ఇంటి తాళాలు ఎక్కడ ఉన్నాయో కూడా ఎవరికీ తెలియదు ఏం చేస్తున్నారు మీరంతా అని అమరేంద్ర అంటాడు.  తలాలు దొరకట్లేదు డోరు పలక కొడతాను అని రాథోడ్ అంటాడు. రాథోడ్ డోరు పగలగొట్టడానికి నేను ఒప్పుకోను అని అమరేంద్ర అంటాడు. ఈ టైం లో కూడా ఇలాంటి పట్టింపులు అవసరం అంటారా సార్ ఎవరైనా కార్పెంటర్ ని పిలిచి బాగు చేయించొచ్చులే అని భాగమతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode December 19 2023 Episode 110 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 19 2023 Episode 110 Highlights

అదే కార్పెంటర్ ని ఇప్పుడు పిలుచుకురా రాథోడ్ అని అమరేంద్ర అంటాడు. రాథోడ్ కార్పొరేట్ అని తీసుకురావడానికి వెళ్తాడు. మిస్సమ్మ నువ్వు ఇందాకేదో చెప్పాలన్నావుగా చెప్పు అని అమరేంద్ర అంటాడు. ఇప్పుడు ఈ సిచువేషన్ లో చెప్తే బాగోదు లేండి అని భాగమతి అంటుంది. వాళ్ళిద్దరూ రూమ్లో ఉండగా మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. కట్ చేస్తే, రామ్మూర్తి డ్యూటీ నుంచి ఇంటికి వస్తాడు. బ్యాగు ఇలా ఇవ్వండి అని మంగళ అంటుంది. ఏమి అవసరం లేదు అని రామ్మూర్తి అంటాడు. సెక్యూరిటీ గార్డ్ పనే కదా దానికి ఇంత బిల్డప్ ఇస్తున్నారు అని అంటుంది మంగళ. నేను లేనప్పుడు నా బ్యాగ్ చెక్ చేశారా అని రామ్మూర్తి అంటాడు. మీరు ఎక్కడ పని చేస్తున్నారు తెలియకపోతే మాకు ఎలా తెలుస్తుంది అండి నీకేమన్నా అయితే ఎలా సెక్యూరిటీ గార్డు పని అంటే ఎండలో నిలబడి చేయాలి ఈ వయసులో మీరు చేయడమేంటండి మీరు ఇంట్లోనే ఉండండి నేను నాలుగు ఇళ్లల్లో పని చేసి మిమ్మల్ని సాదుకుంటాను అని మంగళ అంటుంది. నీలో ఇంత సడన్గా మార్పు ఏంటి అని రామ్మూర్తి అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode December 19 2023 Episode 110 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 19 2023 Episode 110 Highlights

నేను పని చేసింది సరిపోకపోతే నా తమ్ముడు కూడా కూలి పనికి వెళ్తాడు అని మంగళ. నీలో ఈ మార్పు కోసమే నేను ఇన్నాళ్లు ఎదురు చూసింది అయినా నేను కష్టపడి పని చేయట్లేదు ఇష్టపడే వెళ్తున్నాను అని రామ్మూర్తి అంటాడు.అంతగా ఇష్టపడడానికి ఏముందండి అక్కడ అని మంగళ ఉంటుంది.అక్కడ నాకు ఒక బంధం ఏర్పడింది వాళ్ళని చూస్తే నాకు సంతోషమేస్తుంది మొన్న భోజనానికి వెళ్ళింది కూడా వాళ్ళింటికి అని రామ్మూర్తి చెప్తాడు. అయితే భాగమతి కనిపించిందా బావ అని వాళ్ళ బామ్మర్ది అంటాడు. వాళ్ళింటికి భోజనానికి వెళ్తే భాగమతి అక్కడ ఎందుకు కనిపిస్తుంది రా అని రామ్మూర్తి అంటాడు. వీడు అలాగే మాట్లాడతాడు కానీ కూతుర్లాంటి అమ్మాయి ఇంటికి భోజనానికి వెళ్లొచ్చారా అని మంగళ అంటుంది. అవునే కానీ ఆ ఇంట్లో మనుషులందరూ మంచి వాళ్లే కానీ ఆ ఇంట్లో ఒక మనోహరి అని అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చాలా తేడాగా ఉంది సర్లే నాకు కొంచెం తలనొప్పిగా ఉంది టీ పెట్టి ఇవ్వు అని రామ్మూర్తి అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode December 19 2023 Episode 110 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 19 2023 Episode 110 Highlights

రేయ్ ఆ ఇంట్లో మనోహరి అనే అమ్మాయి ఉందంట తను మనకు పనికొస్తుంది వెళ్లి ఆ అమ్మాయి వివరాలు కనుక్కొని రా అని మంగళ అంటుంది. అలాగే అక్క అని వాళ్ళ తమ్ముడు వెళ్లిపోతాడు. కట్ చేస్తే, అయ్యో రాథోడ్ గారు కార్పెంటర్ ని తీసుకురావడానికి ఇంత లేట్  చీకటి అయిపోయింది అని టెన్షన్ పడుతుంది అరుంధతి. నీవు అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడినంత మాత్రాన వెళ్లిన అతగాడు తిరిగి వచ్చునా అని గుప్తా అంటాడు. అతను లేకపోతే తాళాలు తీసి అతనిని తీసుకొని రావచ్చు కదా అని అరుంధతి అంటుంది. అతకాడు కూడా ఉన్నాడో లేడో ఏదైనా పని మీద బయటకు వెళ్ళాడేమో అని గుప్తా అంటాడు. గుప్తా గారు నాకు టెన్షన్ పెరిగిపోతుంది అని బాగా అరుంధతి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N