Salaar: దేశవ్యాప్తంగా “సలార్” సినిమా హడావిడి స్టార్ట్ అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ సినిమాపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. “సలార్” సినిమాకి సంబంధించి విడుదలైన రెండు ట్రైలర్ లు అంచనాలను పెంచేయడం జరిగింది. స్నేహితుల మధ్య సాగే స్టోరీగా… సినిమాని చిత్రీకరించడం జరిగింది. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మరియు మలయాళ నటుడు పృథ్వీరాజ్ ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా నటిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ శత్రువులుగా మారటం కూడా సినిమాలో ఒక భాగం. డిసెంబర్ 22వ తారీకు “సలార్” సినిమా విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా… నటుడు పృథ్వీరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “సలార్” సినిమా స్టోరీ విన్న వెంటనే తాను మొదటిగా ప్రభాస్ కి ఫోన్ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ సినిమాలో భారీ సీడ్స్ యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే కాదు.. అద్భుతమైన పాత్రలు.. ఇంటేన్స్ డ్రామా ఉందని స్పష్టం చేశారు. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తాను వేరే ఇండస్ట్రీ నుండి చెందినవాడనే భావన రాలేదని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కంటెంట్ సినిమాలో ఉందని పృథ్వీరాజ్ తెలిపారు. మరోపక్క దర్శకుడు ప్రశాంత్ నీల్ సైతం సినిమాలో పాత్రల మధ్య సృష్టించిన డ్రామా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని పేర్కొన్నారు.
ఈ సినిమాపై నాకు చాలా నమ్మకం ఉంది. డ్రామా సృష్టించడం అనేది చాలా కష్టమైన పనే. కానీ అది సరిగ్గా వర్క్ అవుట్ అయింది అంటే ఇంకా సినిమాకి తిరుగు ఉండదు. సలార్ సినిమాని నేను పాత్రల మధ్య భావోద్వేగాల రీతిలో చూస్తున్నా, భావోద్వేగాల సన్నివేశాలు చాలా చక్కగా హ్యాండిల్ చేశానని భావిస్తున్నాను. అందుకే సినిమా విజయంపై ధీమాగా ఉన్నట్లు ప్రశాంత్ నీల్ పేర్కొన్నారు. సినిమాలో ప్రభాస్ చాలా వైలెంట్ పాత్రలో కనిపిస్తున్నారు. సినిమాకి ఏమాత్రం మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చిందంటే… రికార్డులు ఇంకా గల్లంతే అని ఫ్యాన్స్ అంటున్నారు.