NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Undavalli Arun Kumar: జగన్ ఇన్ చార్జిల మార్పు వ్యూహం, జేడీ నూతన పార్టీ  పరిణామాలపై ఉండవల్లి ఆసక్తికర కామెంట్స్

Undavalli Arun Kumar: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకు మారుతున్నాయి. ఓ పక్క వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పలు నియోజకవర్గాల్లో ఇన్ చార్జిల మార్పుపై దృష్టి పెట్టారు. పలువురు మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో జగన్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొందరి స్థానాలను మార్పు చేస్తుండగా, మరి కొందరిని పక్కన పెడుతున్నారు.

మరో పక్క టీడీపీ – జనసేన ఉమ్మడి కార్యచరణకు సన్నద్దం అయ్యింది. ఇదే సమయంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితులపై మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెడుతున్నారనే వార్తలపై ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల్లో త్యాగాలు చేయడానికి ఎవరూ రారనీ, సీటు లేదని చెప్పాలంటే దానికి చాలా అనుభవం ఉండాలన్నారు. అటువంటి అనుభవం జగన్మోహనరెడ్డికి ఉందని తాను అనుకోవడం లేదన్నారు.

టికెట్లు మార్చే ప్రక్రియ సరికాదని అన్నారు ఉండవల్లి. తెలంగాణలో సిట్టింగ్ లను మార్చకపోవడం వల్ల అక్కడ కేసిఆర్ ఓడిపోయారనీ, ఇక్కడ సిట్టింగ్ లను మారిస్తే జగన్ గెలుస్తారని అనుకోవడం సరికాదని అన్నారు. ఏపీలో ఎమ్మెల్యేలకు ఎక్కడా అధికారం లేదనీ, అధికారం అంతా జగన్మోహనరెడ్డి, వాలంటీర్ల చేతిల్లో మాత్రమే ఉందని అన్నారు. దేశంలోనే జగన్మోహనరెడ్డి గొప్ప ప్రయోగం చేశారనీ, అప్పులు చేసి సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచడం ఎక్కడా చూడలేదని అన్నారు.

ఇక జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ పార్టీపై ఉండవల్లి మాట్లాడుతూ .. జేడీ పార్టీ పెట్టడం వల్ల సీట్లు సాధించకపోవచ్చు కానీ ఓట్లు ఎంత శాతం సంపాదిస్తుంది అనేది రాజకీయ పరిణామాలు మారడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. చంద్రబాబు, జగన్మోహనరెడ్డి నిజాయితీగా పార్టీని నడపడం రాక కాదనీ, నడపడం వల్ల పయోజనం లేకనేనని అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలవడం వల్ల వాళ్లకు బలమే అవుతుందని అన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రభావంతో ఏపీలోనూ కాంగ్రెస్ పుంజుకుంటుందని ఉండవల్లి అశాభావం వ్యక్తం చేశారు.

NRI TDP: గుంటూరు సీఐడీ కార్యాలయానికి ఎన్ఆర్ఐ యాష్ .. 41ఏ నోటీసులు అందజేత

Related posts

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju