Salaar: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్ గీతూ రాయల్ అందరికీ సుపరిచితురాలే. ఆ సీజన్ లో బిగ్ బాస్ ఇచ్చే రూల్స్ కంటే ఏమి ఆడిన ఆట తీరు వల్ల గేమ్ మొత్తం కంపు కంపుగా మారింది. కచ్చితంగా టైటిల్ గెలుస్తానని భావించిన గీతూ… నీ ఆడియన్స్ టాప్ ఫైవ్ చేరకముందు గానే ఇంటికి పంపించడం జరిగింది. ఆ సమయంలో గీతూ… ఎంతో తల్లడిల్లిపోయింది. ఇదిలా ఉంటే ఇటీవల సీజన్ సెవెన్ లో ఎలిమినేట్ అయిన సభ్యులను బిగ్ బాస్ బజ్ ద్వారా గీతూ… ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇటీవల సీజన్ సెవెన్ కంప్లీట్ అయిన తర్వాత గీతూ రాయల్ వాహనంపై కూడా దాడి జరిగింది. ఈ రకంగా వార్తల్లో ఇటీవల మార్మోగిన గీతూ…పై తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
విషయంలోకి వెళ్తే డిసెంబర్ 22వ తారీకు ప్రభాస్ నటించిన “సలార్” సినిమా విడుదల కావడం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. మొదటి రోజే బ్లాక్ బస్టర్ ట్రాక్స్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో చాలామంది సెలబ్రిటీలు తమ రివ్యూ మరియు స్పందన తెలియజేస్తూ ఉన్నారు. ఈ రకంగానే గీతూ.. “సలార్” సినిమా రివ్యూ గురించి మాట్లాడుతూ.. కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేసింది. సలార్ బెనిఫిట్ షో పడకముందు సినిమా ఫ్లాప్ అవుతుందని భావించాను.. అంటూ తన వీడియోలో రివ్యూ చెబుతూ స్టార్ట్ చేయడం పై ఫ్యాన్స్ అసహనం చెందారు. కానీ ఆ వీడియోలో సినిమా అద్భుతంగా ఉందని చాలా ట్విస్టులు బాగున్నాయి. మొదటిసారి సినిమా చూస్తే ఏం అర్థం కాలేదు.
ట్వీస్టులు మరియు కొన్ని సీన్స్ డైలాగులు ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు. అయితే సెకండ్ టైం సినిమా చూస్తే చాలా బాగా అర్థమయింది. ఫస్ట్ చూసిన వాళ్ళకి అంత తొందరగా ఎక్కదు. పైగా నాకు అంత బుర్ర లేదేమో అందుకే నాకు అర్థం కాలేదు. కానీ సినిమా స్టోరీ పరంగా చాలా బాగుంది. ప్రభాస్ కటౌట్ అయితే ఓ మై గాడ్ అనేట్టుగా ఉంది. ప్రభాస్ గత సినిమాలలో అంత అందంగా లేడు. కానీ ఈ సినిమాలో … చాలా బాగా చూపించారు. “సలార్” సినిమా రెండుసార్లు చూడాల్సిందే మొదటిసారి చూస్తే అర్థం కాదు అంటూ గీతూ.. రివ్యూ ఇవ్వటంపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.