Vyooham: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా “వ్యూహం” విడుదలకు మళ్లీ అడ్డంకులు కలిగాయి. గతంలోనే ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వటానికి బోర్డు సభ్యులు నిరాకరించారు. దానికి ప్రధాన కారణం సినిమాలో పాత్రల పేర్లు నిజజీవితంలో.. వ్యక్తుల పేర్లు పోలి ఉండటం. దీంతో రాంగోపాల్ వర్మ… రివైజింగ్ కమిటీకి పంపించి అక్కడ అనుమతులు పొందుకొని సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. ఇక విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేవని సెన్సార్ సర్టిఫికేట్ సోషల్ మీడియాలో చూపిస్తూ పోస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో.. “వ్యూహం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు.
ఇలాంటి పరిస్థితులలో సినిమా విడుదల కాబోతోంది అన్న అనుకున్న సమయంలో మళ్లీ బ్రేకులు పడ్డాయి. విషయంలోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. “వ్యూహం” సినిమా విడుదలకు అడ్డుపడ్డారు. ఈ సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ ఈనెల 26వ తారీఖున విచారణకు రానుంది. అప్పటివరకు “వ్యూహం” సినిమా విడుదల చేయొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాదు తన పిటీషన్ లో ఏపీ సీఎం వైఎస్ జగన్ అంటే రాంగోపాల్ వర్మకి ఇష్టమని చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్.. తాను అంటే ఇష్టం లేదని జగన్ కి లబ్ధి చేకూర్చే విధంగా ఈ సినిమా చిత్రీకరణ జరుపుకున్నట్లు లోకేష్ స్పష్టం చేశారు. దీనిలో భాగంగా ఇష్టానుసారమైన పాత్రలను ఎంచుకుని చంద్రబాబుని తప్పుగా చూపించడానికి ప్రయత్నాలు చేయడం జరిగిందని అన్నారు.
అంతేకాదు ట్రైలర్ లో చూపించిన విధంగానే సినిమా మొత్తం ఉండే అవకాశం ఉందని అన్నారు. వాక్ స్వాతంత్రం పేరుతో దర్శక నిర్మాతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వీరి చర్యల వల్ల చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలగడంతో పాటు పార్టీ… గౌరవం దెబ్బతినేలా ఉంది. గతంలో జగన్ కి లాభం వచ్చే విధంగా కొన్ని సినిమాలు చేశారు..అవి అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అయినా గాని మరోసారి ఆ తరహాలోనే ఈ సినిమాని నిర్మించారు. కేవలం జగన్ కి లాభం చేయడానికి ఈ సినిమా చిత్రీకరించారు అంటూ.. లోకేష్ పిటిషన్ లో స్పష్టం చేశారు. మరొక రాంగోపాల్ వర్మ ఈ సినిమా డిసెంబర్ 29వ తారీకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మరియు “వ్యూహం” సినిమాపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!