Salaar: గత ఐదు సంవత్సరాల నుండి భారతీయ చలనచిత్ర రంగంలో దక్షిణాది సినిమా టాలెంట్ పై చెయ్యి సాధిస్తుంది. ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గురించి ప్రపంచ సినీ ప్రేమికులు మాట్లాడుకోవాల్సి వస్తే బాలీవుడ్ గురించి మాట్లాడుకునే వాళ్ళు. అంతగా బాలీవుడ్ ప్రభావం మిగతా సినిమా ప్రపంచం పై ఉండేది. అదే సమయంలో బాలీవుడ్ సౌత్ ఫిలిం ఇండస్ట్రీని చాలా చిన్న చూపు చూస్తూ.. వెటకారాలు చేసే పరిస్థితి అప్పట్లో ఉండేది. కానీ గత ఐదు సంవత్సరాల నుండి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ది గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి తీసిన “బాహుబలి” బాలీవుడ్ నీ నోరు మెదపకుండా చేసింది. ఆ తర్వాత దక్షిణాది సినిమాల హవా మెల్ల మెల్లగా పెరుగుతూ వచ్చింది. గత కొన్ని సంవత్సరాల నుండి బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు.. “బాహుబలి” రికార్డులు బ్రేక్ చేయాలని అనేక సినిమాలు చేస్తే అవి అట్టర్ ప్లాప్ అయ్యాయి.
ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్స్ కూడా దక్షిణాది టాలెంట్ ని నమ్ముకుని సినిమాలు చేస్తూ ఉన్నారు. ఆ రకంగానే ఇటీవల షారుఖ్ ఖాన్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో “జవాన్” సినిమాతో విజయం సాధించారు. రణబీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో “యానిమల్” సినిమాతో విజయం సాధించారు. ఇదిలా ఉంటే 2023 చివరిలో షారుక్ ఖాన్ నటించిన “డంకీ”… ప్రభాస్ నటించిన “సలార్” సినిమాలు.. ఒక రోజు గ్యాప్ వ్యవధిలో విడుదల కావడం జరిగాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడగా.. ప్రభాస్ “సలార్” పై చేయి సాధించటం జరిగింది. ఓపెనింగ్స్ లో ఈ ఏడాదిలోని అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా “సలార్” నిలిచినట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ అంటే ఎక్కువగా ముంబై గురించి మాట్లాడుకుంటారు. అటువంటి బాలీవుడ్ అడ్డా ముంబైలో కూడా ప్రభాస్ సత్తా చాటుతూ ఉన్నారట.
ముంబైలో ఐకానిక్ థియేటర్ మరాఠా మందిర్ లో షారుక్ మరియు కాజోల్ నటించిన “దిల్వాలే దుల్హనియా లేజాయేంగే” సినిమా ఇప్పటికీ ప్రదర్శించబడుతుంది. ఈ క్రమంలో డిసెంబర్ 21వ తారీకు షారుక్ “డంకీ” సినిమాకి అన్ని షోస్ ఇవ్వటం జరిగింది. కానీ రెండో రోజు సీన్ మొత్తం మారిపోయింది. మేటర్ లోకి వెళ్తే “డంకీ”.. సినిమా నీ పక్కన పెట్టి అదే థియేటర్ లో ప్రభాస్ “సలార్” చిత్రానికి షోస్ కేటాయించడం జరిగింది. “డంకీ” సినిమా ఫస్ట్ డే మిక్స్ డ్ టాక్ రావటం జరిగింది. “సలార్” మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో షారుక్ హవా నడిచే థియేటర్లో కూడా ప్రభాస్ “సలార్” సినిమా మోత మోగుతుంది. పోటా పోటీగా దిగిన ఇద్దరి హీరోల్లో ప్రభాస్ పై చేయి సాధించినట్లు అయింది.