NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: వైఎస్ షర్మిల వెంట నడిచే మొదటి ఎమ్మెల్యే రెడీ అయ్యారు(గా)..!

YS Sharmila: ఏపీ రాజకీయాల్లోకి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వస్తున్నట్లుగా గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఆమెకు ఏపీ పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా ఆమె పార్టీలోకి రాకను స్వాగతిస్తున్నారు. ఆమెకు పార్టీ లో ఏ బాధ్యతలు అప్పగించాలనేది మల్లికార్జునఖర్గే, రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని ఇటీవలే ఏపీ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాకూర్ వెల్లడించారు.

YS Sharmila

ఈ తరుణంలో షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఆమె వెంట నడిచేందుకు ఒక వైసీపీ ఎమ్మెల్యే సిద్దమైయ్యారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆమె వెంట నడిచేందుకు సిద్దం అవుతున్నారు. ఇటీవలే ఆయన వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను ఇంత వరకూ స్పీకర్ ఆమోదించలేదు. ఈ తరుణంలో ఆర్కే తన రాజకీయ ప్రస్థానం గురించి పరోక్షంగా చెప్పేశారు. మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉంటాను అనేది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు.

Mangalagiri: Lokesh Political Strategy Mangalagiri Ground Report
Alla Ramakrishna Reddy

వైసీపీకి ఎంత సేవ చేశానో తనకు తెలుసునని అన్నారు. తాను పార్టీ కోసం సర్వస్వం పోగొట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకై తాను వైఎస్ షర్మిలా వెంట నడుస్తాననీ, షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటానని ప్రకటించారు. తాము మొదటి నుండి వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తినని చెప్పుకొచ్చారు. ఇప్పటికే తాను షర్మిలను కలిశానని చెప్పారు. వైసీపీకి సిద్దాంతాలు ఉండాలన్నారు. ఎంచుకున్న అభ్యర్థులను ఒడించాలి అంటే ఆ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చెయ్యాలన్నారు. మంగళగిరి ప్రజలు అభివృద్ధినీ కోరుకుంటున్నారని చెప్పారు. రూ.1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి కేవలం రూ.120 కోట్లు కేటాయించారని చెప్పారు.

50 ఏళ్లలో జరగని అభివృద్ధి  నాలుగేళ్లలో తాను చేసి చూపించానన్నారు. మంగళగిరి అభివృద్ధికి నిధులు విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 8 కోట్ల వరకూ తాను బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్ లకు ఇచ్చాని అన్నారు. కాంట్రాక్టర్ లు చేస్తున్న ఒత్తిడిని సీఎంవోకు పదే పదే వెళ్లి అడిగినా ఫలితం కనబడలేదున్నారు. లోకేష్ ను ఓడించిన తనకు సహకారం అందించకపోతే ఎలా అని ప్రశ్నించారు. తాను ఎవరిని నిందించడం లేదని అన్నారు. ధనుంజయ రెడ్డి నిధులు మంజురు చేస్తానని చాలా సార్లు మేసేజీలు పెట్టారని చెప్పారు. ఎన్నికలు దగ్గరకు వచ్చినా ఎప్పుడు నిధులు మంజూరు చేస్తారని ప్రశ్నించారు. తన రాజీనామా ఆమోదించకపోవడం అనేది వాళ్ళ ఇష్టమని అన్నారు. తాను స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ఇచ్చానని తెలిపారు. మంగళగిరి ప్రజలకు తాను దూరంగా ఉండనని చెప్పారు. ఎవరు గెలవాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. తాను ఏ పార్టీలో చేరినా ఆరోజు నిర్ణయం చెప్తానని అన్నారు.

చంద్రబాబుపై వేసిన కేసులపై న్యాయ పోరాటం కొనసాగిస్తానని ఆర్కే అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా  వెనక్కి తీసుకొనని చెప్పారు. రేవంత్ కాంగ్రెస్ లో ఉన్నా షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చినా తన పోరాటం మాత్రం ఆగదని అన్నారు. తప్పు ఎవ్వరూ చేసినా తప్పేనని, వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తే వాటిపై కేసులు వేసేందుకు అయినా వెనకాడనని చెప్పారు. తప్పులు ఎవరు చేశారు అనేది న్యాయ స్థానాలు తెలుస్తాయని ఆర్కే అన్నారు. తాను లేకపోయినా మంగళగిరి అభివృద్ధి ఆగదని పేర్కొన్నారు. తనకు జగన్ టికెట్ ఇవ్వలేదని పార్టీని వీడలేదనీ, చిరంజీవికి , జగన్ కి తనకు మధ్య ఏమి జరిగింది అనేది అందరికీ తెలుసునని అన్నారు.

Nara Lokesh: లోకేష్ యే సైకోగా మారాడంటూ ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు ఫైర్

Related posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?