NewsOrbit
జాతీయం న్యూస్

PM Modi: దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సూచన .. ఆ రోజు అందరూ ఆ పని చేయండి

PM Modi: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరం జనవరి 22న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న హిందూ సమాజంతో పాటు విదేశాల్లోని అనేక మంది భక్తులు కూడా ఈ రోజు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇవేళ మన్ కీ బాత్ 108వ ఎపిసోడ్‌లో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు కీలక సూచనలు చేశారు.

అయోధ్యలోని రామ మందిరం ప్రారంభం రోజున అంటే జనవరి 22న దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ ఆలయం గురించి వారి క్రియోషన్లను #ShriRamBhajan అనే హ్యాష్‌ట్యాగ్‌తో  సోషల్ మీడియాలో పంచుకోవాలని సూచించారు. ఈ క్రమంలో శ్రీరాముడు లేదా అయోధ్య గురించి భజనలు, పాటలు లేదా తమ భావాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయాలని మోడీ కోరారు. ఈ సందర్భంగా అనేక మంది కొత్త పద్యాలు కూడా రాస్తున్నారని గుర్తు చేశారు. ఈ చారిత్రక ఘట్టంలో పలువురు తమదైన విశిష్టమైన రీతిలో ఇప్పటికే భాగస్వామ్యులవుతున్నారని అన్నారు.

మనమందరం అలాంటి క్రియేషన్‌లన్నింటినీ ఒకే రోజు ఉమ్మడి హ్యాష్‌ట్యాగ్‌తో పంచుకుంటే భావోద్వేగాలు, భక్తి ప్రవాహాంతో సోషల్ మీడియా మారుమోగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ రాముడి తత్వాన్ని నింపుకోవచ్చని అన్నారు. ఇప్పటికే అనేక మందికి అయోధ్యకు వచ్చేందుకు సిద్దమవుతున్నారన్నారు. అయోధ్య రావడం కుదరకపోతే ఇంట్లోనే దీపాలు వెలిగించి పూజలు చేయాలని కూడా ప్రధాని సూచించారు.

ముందుగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది దేశంలో ఎన్నో ఘనతలు సాధించామని గుర్తు చేశారు. 2023 లో దేశ ప్రజల్లో వికసిత్ భారత్ స్పూర్తి రగిలిచిందన్నారు. దాన్ని కొత్త సంవత్సరంలో కూడా కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది సాధించిన విజయాలను మోడీ గుర్తు చేశారు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లు ఈ ఏడాదిలోనే ఆమోదం లభించిందన్నారు.

భారత్ అయిదవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించిందని పేర్కొన్నారు. దీనిపై దేశ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ లేఖలు రాస్తున్నారని వెల్లడించారు. ప్రతిష్టాత్మక జీ 20 సదస్సును విజయవంతంగా నిర్వహించామని అన్నారు. ఈ ఏడాది నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కడం తో దేశం మొత్తం ఉర్రూతలూగిందన్నారు మోడీ. ఎలిఫెంట్ విన్పరర్స్ కు సైతం ప్రతిష్టాత్మక అవార్డు రావడం తో భారతీయుల ప్రతిభ వెలుగుచూసిందని వ్యాఖ్యానించారు.

2023 లో భారతీయుల సృజనాత్మకతను యావత్ ప్రపంచం వీక్షించిందని తెలిపారు. ఈ ఏడాది లో మన క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చూపారని మోడీ కొనియాడారు. అసియా క్రీడల్లో 107, పారా గేమ్స్ లో 111 పతకాలతో సత్తా చాటారని గుర్తు చేశారు. వన్డే ప్రపంచ కప్ లో భారత క్రికెట్ జట్టు అందరి మనసులు గెలుచుకుందని ప్రశంసించారు. చంద్రయాన్ – 3 విజయవంతం పై చాలా మంది తనకు సందేశాలు పంపుతున్నారని మోడీ తెలిపారు.

TDP BJP Alliance: బాబు బిషాణ సర్దేసుకోవాల్సిందేనా..?

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?