Trisha: ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు వెలుగు వెలిగిన హీరోయిన్స్ ఇటీవల సెకండ్ హాఫ్ స్టార్ట్ చేసి సూపర్ హిట్ లు అందుకుంటున్నారు. ఈ రకంగా హీరోయిన్ త్రిష బ్యాక్ టు బ్యాక్ విజయాలు ఇటీవల సొంతం చేసుకోవడం జరిగింది. 2004 నుండి 2008 వరకు తెలుగు, తమిళ సినిమాలలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తెలుగు చలనచిత్ర రంగంలో 2004వ సంవత్సరంలో ప్రభాస్ తో “వర్షం” ఆ తరువాత “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” ఆ రకంగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడ్డాయి. ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఇంకా చాలామంది హీరోలతో నటించింది.
అయితే మొదట్లో వరుస విజయాలు అందుకున్న త్రిష కొన్నాళ్లకు పరాజయాలు ఎదురు కావటంతో కొంత గ్యాప్ అవకాశాలు తగ్గటం మొదలు పెట్టాయి. కానీ ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో “పొన్నియన్ సెల్వన్” సినిమాలలో నటించడం జరిగింది. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. ఆ తర్వాత విజయ్ తో “లియో” సినిమా చేయడం జరిగింది. ఇంకాగా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ సల్మాన్ తో “ది బుల్” అనే సినిమా ప్రకటించటం తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
1988 ఆపరేషన్ కాక్టాస్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో సల్మాన్ ఖాన్ భార్యగా త్రిష నటిస్తున్నట్లు బాలీవుడ్ మీడియా రంగంలో టాక్. సినిమా స్టోరీలో త్రిష పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా అధికారిక ప్రకటన చేయగా వచ్చే ఏడాది నుండి సినిమా షూటింగ్ మొదలుకానుంది. సల్మాన్ ఖాన్ తో ఛాన్స్ అందుకున్న త్రిష ఆల్రెడీ ప్రస్తుతం అజిత్, కమల్ హాసన్ సినిమాలతో బిజీగా ఉంది. 2023 ఏడాది త్రిషకి బానే కలిసి వచ్చింది. ఇక 2024లో ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమా ఛాన్స్ ఎందుకోవటంతో త్రిష ఫ్యాన్స్ పొంగిపోతున్నారు.