NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు..? ..ఆప్ మంత్రుల ట్వీట్

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు గైర్హజరు అవుతున్న నేపథ్యంలో ఆయనను ఈడీ అరెస్టు చేస్తుందంటూ ఊహాగానాలు వస్తున్నాయి. వరుసగా మూడు సార్లు ఈడీ నోటీసులు పంపినా కేజ్రీవాల్ విచారణకు డుమ్మా కొట్టారు. ఇప్పటికీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నేతలు మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్ వంటి నేతలు జైలులో ఉన్నారు.

డిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తొంది. ఈ క్రమంలో కేసులో విచారణకు హజరుకావాలని ఈడీ ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చింది. కానీ కేజ్రీవాల్ మాత్రం ఇప్పటి వరకూ ఒక్క సారి కూడా ఈడీ ముందు విచారణకు హజరుకాలేదు. కేజ్రీవాల్ కు తొలుత గత ఏడాది నవంబర్ 2న విచారణకు హజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ కేజ్రీవాల్ విచారణకు హజరుకాలేదు. ఆ తర్వాత డిసెంబర్ 21, జనవరి 3న విచారణకు హజరుకావాలని ఈడీ నోటీసులు పంపింది. కానీ వాటిని కూడా కేజ్రీవాల్ దాట వేశారు.

ఈ నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను గురువారం ఈడీ అరెస్టు చేస్తుంది అంటూ ఆప్ నేతలు, మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ ట్వీట్ చేశారు. గురువారం ఉదయం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై ఈడీ దాడులు చేస్తుందని, ఆ తర్వాత అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని బుధవారం అర్ధరాత్రి చేసిన ట్వీట్ లో వారు పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో గురువారం ఉదయం ఈడీ దాడి చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ బుధవారం రాత్రి 11.50 గంటలకు ఆప్ మంత్రి అతిషి ట్వీట్ చేశారు. ఆ తర్వాత మరో మంత్రి సౌరఖ్ భరద్వాజ్ ఇదే విషయాన్ని హిందీలో పోస్టు చేశారు.

కేజ్రీవాల్ ఇంటికి వెళ్లే రహదారులను పోలీసులు ఇప్పటికే బ్లాక్ చేశారని, అరెస్టునకు ముందు కేజ్రీవాల్ ఇంటిపై సోదాలు జరిపే అవకాశం ఉందని ఆప్ నేతలు పేర్కొన్నారు. ఈ కేసులో విచారణ కోసం ఇప్పటికే మూడు సార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ నుండి ఎలాంటి స్పందన లేదని ఈడీ వర్గాలు తెలిపాయి. విచారణకు సహకరించకపోవడంతో నిబంధనల ప్రకారం ఆయనపై ఎప్పుడైనా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయవచ్చు. ఆయన్ని అరెస్టు చేయవచ్చు.

అయితే ఈడీ సమన్లు ప్రేరేపితమైనవని కేజ్రీవాల్ అన్నారు. ఈ కేసులో తనను సాక్షిగా పిలుస్తున్నారా.. లేదా అనుమానితుడిగా పిలుస్తున్నారా అనేది స్పష్టంగా తెలియదని చెప్పారు. ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేయకుండా తనను ఆపాలనే ఈడీ యోచిస్తున్నట్లు ఆరోపించారు.

Kesineni Nani Vs kesineni Chinni: కేశినేని బ్రదర్స్ వార్ .. తిరువూరులో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ .. ఎస్ఐకి గాయాలు

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!