NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనం .. కాంగ్రెస్ కండువా కప్పుకున్న వైఎస్ షర్మిల

YS Sharmila: కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్ టీపీ పార్టీ విలీనం అయ్యింది. ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బుధవారం సాయంత్రం విజయవాడ నుండి నేరుగా ఢిల్లీకి వెళ్లిన వైఎస్ షర్మిల.. గురువారం ఉదయం తన భర్త అనిల్, పలువురు అభిమానులతో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.

అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసి వేణుగోపాల్, ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తదితరుల సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిలకు పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏఐసీసీలో పదవి ఇస్తారా.. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారా అనే దానిపై జోరుగా ఊహగానాలు కొనసాగుతున్నాయి.

ఏపీయే కాదు అండమాన్ కు వెళ్లమన్నా వెళ్తా..

కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడం సంతోషంగా ఉందని అన్నారు వైఎస్ షర్మిల. ఈరోజు నుండి కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ ఒక భాగమని చెప్పారు. దివంగత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గొప్ప నేత, ఆయన జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేశారన్నారు. తన తండ్రి అడుగుజాడల్లోనే తాను నడుస్తానని చెప్పారు. దేశంలో అతిపెద్ద లౌకక పార్టీ కాంగ్రెస్, అన్ని వర్గాలను కలుపుతూ పని చేస్తుందని అన్నారు. ఒక క్రిస్టియన్ గా మణిపూర్ లో చర్చిల కూల్చివేత తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.

సెక్యులర్ పార్టీ అధికారంలో లేకపోతే ఏం జరుగుతుంది అనడానికి ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ పై నమ్మకాన్ని తనతో పాటు ప్రజలందరిలో పెంచిందని అన్నారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న ఉద్దేశంతో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించి పోటీ చేయలేదని చెప్పారు. రాహుల్ గాంధీ నీ ప్రధానిగా చూడాలన్నది తన తండ్రి అశయమని, అది నెరవేర్చడానికి మనస్పూర్తిగా పని చేస్తానని తెలిపారు. ఏపీ పార్టీ బాధ్యతలు స్వీకరిస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఏపీయే కాదు పార్టీ అండమాన్ వెళ్లమన్నా వెళ్తానని చెప్పారు. పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని షర్మిల తెలిపారు.

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు..? ..ఆప్ మంత్రుల ట్వీట్

Related posts

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?