NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Kesineni Sweta: విజయవాడ టీడీపీకి మరో ఝలక్ .. తండ్రి బాటలో తనయ

Kesineni Sweta: ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. నిన్న తిరువూరు చంద్రబాబు సభకు అహ్వానించినా వెళ్లలేదు కేశినేని నాని. నానికి మద్దతుగా తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు.

తాజాగా కేశినేని నాని కుమార్తె విజయవాడ మున్సిపల్ కార్పోరేటర్ కేశినేని స్వేత కూడా తండ్రి బాటలో పయనించడానికి సిద్దమైయ్యారు. ఇవేళ  కార్పోరేటర్ పదవికి రాజీనామా చేసి అనంతరం పార్టీకి రాజీనామా చేస్తున్నారు. కేశినేని శ్వేత ప్రస్తుతం విజయవాడ 11వ డివిజన్ కార్పోరేటర్ గా ఉన్నారు. తాను టీడీపీకి రాజీనామా చేస్తున్న క్రమంలో తన కుమార్తె శ్వేత కూడా టీడీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

రాబోయే ఎన్నికల్లో విజయవాడ లోక్ సభ స్థానానికి వేరే వ్యక్తిని అభ్యర్ధిగా ఎంపిక చేస్తున్న క్రమంలో కేశినేని నాని కీలక నిర్ణయాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తన కార్యాలయం మీద పార్టీ జెండాలను పీకేసినట్లు కూడా ఆయనే స్వయంగా తెలిపారు. కేశినేని నానిని బుజ్జగించేందుకు చంద్రబాబు దూతగా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మొన్న రాత్రి కేశినేని నానితో సమావేశమైనప్పటికీ ఆయన మెత్తబడలేదు. తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తిలేదని కరాఖండిగా చెప్పినట్లు సమాచారం.

ఆదివారం కూడా తన రాజీనామాపై మరో సారి స్పష్టత ఇచ్చారు కేశినేని నాని. రాజీనామా చేస్తామని చెప్పిన తర్వాత కచ్చితంగా చేసేస్తానని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యతో రాజీనామా ఆలస్యం అవుతుందని, దానిపై ఇక చర్చించేది ఏమీ ఉండదని తేల్చి చెప్పేశారు. రాజీనామా చేయడం ఖాయం, మళ్లీ విజయవాడ ఎంపిగానే పోటీ చేయడం ఖాయమని మరో సారి స్పష్టం చేశారు కేశినేని నాని. కేశినేని పార్టీ వీడటం ఖాయం అవ్వడం ఎన్టీఆర్ జిల్లాలో ఆయన వర్గీయులు ఇంకా ఎంత మంది రాజీనామా చేస్తారనేది వేచి చూడాలి.

YSRCP MLC: వైసీపీ ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేసిన సీ రామచంద్రయ్య

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju