NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: ఏపీలో వైసీపీ, టీడీపీ దొందూ దొందేనన్న వైఎస్ షర్మిల .. జగన్ పై ఘాటుగా..

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల విజయవాడలో ఇవేళ బాధ్యతలు స్వీకరించారు అనంతరం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. పార్టీలోకి తాను రావాలని కేడర్ కోరుకుందని, వారందరికీ ధన్యావాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు, బీజేపీపైనా విమర్శలు చేశారు. వైసీపీ, టీడీపీ దొందూద దొందేనని విమర్శించారు.

గత పదేళ్లుగా ఆ రెండు పార్టీల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని అన్నారు షర్మిల. రాజధాని అమరావతిని చంద్రబాబు పూర్తి చేయలేదనీ, జగన్ మూడు రాజధానులని చెప్పి ఒక్కటీ చేయలేదని విమర్శించారు.  రాజధాని ఏదంటే ఇప్పుడు ఏమీ అర్ధం కాని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను సీఎం జగన్ తాకట్టు పెట్టారని అన్నారు. ఇప్పుడు ఏపీపై పది లక్షల కోట్ల అప్పుల భారం ఉందని అన్నారు. ఏపీలో ఉద్యోగులకు జీతాలకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఉందని అన్నారు.

ఏపీలో ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడం మాత్రమేనని అన్నారు. ఏపీలో మైనింగ్, ఇసుక మాఫియా రెచ్చిపోతుందని అన్నారు. ఏపీలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడంలో పాలకులకు చేతకాలేదన్నారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే వేలాదిగా ఉద్యోగాలు వచ్చేవని చెప్పారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ .. ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామా చేస్తామన్నారని, కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సారైనా ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదంటే ఆ పాపం జగన్ దేనని షర్మిల అన్నారు. ఈ నాలుగున్న సంవత్సరాల్లో ఆరున్నర కోట్ల రూపాయల అప్పులు చేశారనీ, పట్టుమని పది పరిశ్రమలు వచ్చాయా అని నిలదీశారు. ఏపీ అప్పులు పది లక్షల కోట్లు అంటున్నారనీ, ఇంత అప్పు చేసినా ఏపీలో అభివృద్ధి బూతద్దంలో చూసినా కనిపించడం లేదని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదానే కాదు కనీసం స్పెషల్ ప్యాకేజీ కూడా రాలేదన్నారు. పోలవరం విషయంలో జగన్ ప్రజలను మోసం చేశారని షర్మిల ఆరోపించారు.

విజయవాడలో కీసం ఒక మెట్రో అయినా ఉందా అని ప్రశ్నించారు. రోడ్లు వేసుకోవడానికి కూడా నిధుల్లేని పరిస్థితి ఉందన్నారు. విదేశాల్లోని నల్లధనం తీసుకొస్తామన్న బీజేపీ హామీ ఏమైందని ప్రశ్నించారు. 22 మంది వైసీపీ ఎంపీలు, టీడీపీ ముగ్గురు ఎంపీలు కేంద్రంలోని బీజేపీ చేతుల్లో ఉన్నారని, ఆ పార్టీ ఏమి చేబితే అది చేస్తున్నారని విమర్శించారు షర్మిల. ఏపీపై బీజేపీ కపట ప్రేమ చూపిస్తుందే తప్ప చేసింది ఏమి లేదని మండిపడ్డారు. లక్షల మందికి ఉద్యోగాలు అన్న బీజేపీ .. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. కాగా,  వైఎస్ షర్మిల సమక్షంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు షర్మిల పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. గుంటూరు జిల్లాలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ఆర్కేకు షర్మిల సూచించారు. 

ఇది ప్రజాస్వామ్యమని నియంతలు గుర్తు పెట్టుకోవాలి

తొలుత వైఎస్ షర్మిలకు గన్నవరం విమానాశ్రయం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా విజయవాడ వస్తుండగా, షర్మిల కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఎనికేపాడు వద్ద ర్యాలీగా వెళుతున్న కాంగ్రెస్ పార్టీ నేతల వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. దీంతో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు.

తమ వాహనాలను డైవర్ట్ చేసినందుకు కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు రోడ్డుపై భైటాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా షర్మిల.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   ఇది ప్రజాస్వామ్యమని నియంతలు గుర్తుపెట్టుకోవాలని అనారు. కాంగ్రెస్ పార్టీని చూసి ఏపీ ప్రభుత్వం భయపడుతోందని నేతలు అన్నారు. పోలీసులు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారన్నారు.

Ramoji – Gone Prakash Rao: రామోజీకి గోనె ప్రకాశరావు హెచ్చరిక లేఖ .. ఎందుకంటే..?

Related posts

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?