NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: అప్పుడే.. చెల్లి షర్మిలకు షాకిచ్చేలా జగన్ స్పీచ్ స్టార్ట్స్

YS Jagan: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఇప్పటి వరకూ తన ప్రసంగంలో టీడీపీ అధినేత చంద్రబాబు, దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు వదిన అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని, వీళ్ళకు మద్దతుగా నిలిచే మీడియాపైనే విమర్శలు చేయడం చూశాం. తాజాగా ఇప్పుడు ఆ జాబితాలోకి కాంగ్రెస్ పార్టీ, చెల్లి షర్మిల వచ్చి చేరింది.

జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి జగన్ సర్కార్ పై విమర్శలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో తన విమర్శల జాబితాలో కాంగ్రెస్ పార్టీని చేర్చారు సీఎం వైఎస్ జగన్. అనంతపురం జిల్లా ఉరవకొండలో మంగళవారం వైఎస్ఆర్ ఆసరా నిధుల జమ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ .. ప్రతిపక్షాల కూటమి రాజకీయంపై విసుర్లు విసిరారు.

ఏనాడూ మంచి చేయని చరిత్ర ఉన్న చంద్రబాబు కోసం పక్క రాష్ట్రం .. పక్క పార్టీలోనూ స్టార్ క్యాంపెయినర్ లు ఉన్నారని విమర్శించారు జగన్. మంచినే నమ్మకున్న తనకు అలాంటి వాళ్లు అవసరం ఏ మాత్రం లేదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ మంచీ చేయకపోయినా,  ఏ స్కీమ్ లూ అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ స్టార్ క్యాంపెయినర్ లు దండిగా మంది ఉన్నారన్నారు.

మన రాష్ట్రంలో ఎవరూ ఉండరని, వాళ్ల ఇళ్లు, కాపురాలు, సంసారాలు పక్క రాష్ట్రంలో ఉంటాయని అన్నారు. పక్క రాష్ట్రంలో పర్మినెంట్ రెసిడెంట్ గా ఉన్న దత్తపుత్రుడు స్టార్ క్యాంపెయినర్ అయితే, చంద్రబాబు వదిన గారు .. ఆమె పక్క పార్టీలోకి వెళ్లి చంద్రబాబుకు మరో స్టార్ క్యాంపెయినర్. ఆయన వదిన అంటే అందరికీ తెలిసే ఉంటుందన్నారు. అలానే పక్క రాష్ట్రంలో శాశ్వతంగా ఉంటున్న ముగ్గురు మీడియా అధిపతులు బాబుకు స్టార్ క్యాంపెయినర్లేనన్నారు.

వీళ్లు కాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతున్న ఇంకొంత మంది స్టార్ క్యాంపెయినర్లు.. వీళ్లంతా చంద్రబాబుకు తోడుగా ఉన్నారని పరోక్షంగా షర్మిల ను ఉద్దేశించి విమర్శించారు సీఎం జగన్.  అమరావతిలో బాబు భూములకు బినామీలు ఉన్నట్లే మనుషుల్లోనూ, ఇతర పార్టీల్లోనూ రకరాల రూపాల్లో చంద్రబాబుకు బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగా కొనసాగుతున్నారన్నారు.

మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరని జగన్ అన్నారు. రాష్ట్రంలో మంచి జరిగన ప్రతి ఇల్లూ, ఆ ప్రతి ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మలందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లేనని పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా లబ్దిపొందిన ప్రతి కుటుంబాల్లోని బిడ్డలందరూ స్టార్ క్యాంపెయిర్లేనని అన్నారు.

YSRCP: ఇంత పని చేసిందా ..? మంత్రి రోజాపై సంచలన ఆరోపణలు చేసిన సొంత పార్టీ కౌన్సిలర్

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!