NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే భయపడుతున్న దర్శకులు..?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనతో సినిమా చేయటానికి చాలామంది దర్శకులు మరియు నిర్మాతలు ఎదురు చూస్తుంటారు. ఈ ప్రక్రియలో అవకాశం వస్తే దానిని అదృష్టంగా భావిస్తారు. పవన్ కళ్యాణ్ సినిమాలకు జయపజయాలతో సంబంధం లేకుండా కలెక్షన్స్ వస్తాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓపెనింగ్స్ భారీ ఎత్తున రాబట్టే హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు. అయితే ఇప్పుడు అటువంటి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి తెలుగు ఇండస్ట్రీలో దర్శకులు భయపడే పరిస్థితి నెలకొన్నట్లు ప్రచారం జరుగుతుంది.

Directors who are afraid of a film with Pawan Kalyan

విషయంలోకి వెళ్తే ఒకపక్క సినిమాలు మరోపక్క రాజకీయాలతో పవన్ కళ్యాణ్ బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో రాజకీయ కార్యక్రమాల కారణంగా నిర్మాతలకు ఇచ్చిన కాల్ షీట్స్ మారిపోతూ ఉన్నాయి. సరిగ్గా షూటింగ్ సెట్ అంతా రెడీ అయ్యే సమయంలో పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిన సందర్భాలు ఇటీవల చాలానే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొని డైరెక్టర్ క్రిష్, హరీష్ శంకర్ లాంటి పేరుగాంచిన దర్శకులు సైతం పవన్ ప్రాజెక్టు వదులుకోలేక మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయక మొన్నటి వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న “హరిహర వీరమల్లు” షూటింగ్ నాలుగు సంవత్సరాల నుండి జరుగుతుంది. ఇప్పటికీ విడుదల కాలేదు.

Directors who are afraid of a film with Pawan Kalyan

ఇదే రకంగా “గబ్బర్ సింగ్” లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో “ఉస్తాద్ భగత్ సింగ్” ప్రాజెక్టు ప్రకటించి మూడు సంవత్సరాలైనా ఇప్పటికీ సగం షూటింగ్ పూర్తికాలేదు. దీంతో హరీష్ మరియు క్రిష్ లేటుగా కళ్ళు తెరిచి ఇప్పుడు మరో ప్రాజెక్టులు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న క్రమంలో పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా గడుపుతున్నారు. దీంతో ఆయనతో సినిమాలు ఒప్పుకుంటున్న దర్శకుల పరిస్థితి అటు ఇటు కాకుండా పోతోంది. ఈ పరిణామంతో ఎవరు ఆయనతో ప్రజెంట్ సినిమా చేయడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పవన్ చేతిలో క్రిష్, హరీష్, సుజిత్ సినిమాలు ఉన్నాయి. ఈ మూడు సెట్స్ పై ఉన్నాయి. ఇవి కాకుండా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్నట్లు ఆల్రెడీ ప్రకటన వచ్చింది. ఈ నాలుగు మినహా పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ కారణాల దృష్ట్యా వేరే సినిమా ప్రాజెక్టులు జోలికి వెళ్లకూడదని డిసైడ్ అయినట్లు టాక్. ఏపీలో ఎన్నికలు అయిపోయిన అనంతరం సెట్స్ మీద ఉన్న సినిమాలు చకచకా మొత్తం కంప్లీట్ చేయనున్నట్లు సమాచారం.

Related posts

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N