NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో అక్క‌డ గెలుపు వైసీపీ, టీడీపీది కాదా.. సెంటిమెంట్‌దే ప‌క్కా విక్ట‌రీ…!

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పార్వతీపురం నియోజ‌క‌వ‌ర్గం పార్టీల‌ను ముఖ్యంగా నాయ‌కుల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. జిల్లా లు విభజన తరువాత ఈ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. అయిన‌ప్ప‌టికీ.. వైసీపీలో ఆదిశ‌గా జోష్ అయితే క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం.. స్థానికంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌క‌పోవ‌డ‌మేన‌నే చ‌ర్చ ఉండ‌డ‌మే. ఈ నియోజక వర్గంలో అత్యధికంగా ఇప్పటి వరకు 17సార్లు ఎన్నికలు జరిగాయి. ఆరుసార్లు టీడీపీ, ఐదుసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించగా, గడిచిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయాన్ని దక్కించుకున్నారు.

1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎంవీ నాయుడు విజయం సాధించారు. 1985 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎంవీ నాయుడు రెండోసారి విజయం సాధించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ మ‌రోసారి గెలుపు గుర్రం ఎక్కింది. 1994లో జరిగిన ఎన్నికల్లోనూ అభ్య‌ర్థి మారినా టీడీపీ విజయం సాధించింది. 1997లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎర్రా అన్నపూర్ణమ్మ విజయం ద‌క్కించుకున్నారు. 1999లో మాత్రం కాంగ్రెస్ ఇక్క‌డ పాగా వేసింది. 2004లోనూ ఈ పార్టీనే విజ‌యం సాధించింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సవరపు జయమణి కూడా గెలుపు గుర్రం ఎక్కారు.

అయితే, రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి బొబ్బిలి చిరంజీవులు గెలుపొందారు. అయితే, ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లురావ‌డంతో 2019లో జరిగిన ఎన్నికల్లో ప్ర‌జ‌లు వైసీపీ అభ్యర్థి ఏ జోగారావుకు విజయం క‌ట్ట‌బెట్టారు. ఇక‌, రానున్న ఎన్నికల్లో ఇక్కడ విజయం ద‌క్కించుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. టీడీపీ బోనే విజ‌య్‌కు సీటు క‌న్‌ఫార్మ్ అయ్యింది. వైసీపీ నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యేతోపాటు మరో ఇద్దరు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే.. ఎవ‌రికీ టీడీపీ టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేయ‌లేదు. మ‌రోవైపు.. ఈటికెట్‌ను జ‌న‌సేన ఆశిస్తున్న‌ట్టు ప్రచారం చేస్తున్నారు.

ఇక‌, బ‌లాబ‌లాల విష‌యానికి వ‌స్తే.. వ్య‌క్తుల బ‌లం క‌న్నా.. ప్ర‌జ‌ల్లో సెంటిమెంటు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. వ‌రుస విజ‌యాలు ఇవ్వ‌డం ఈ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌త్యేక‌త‌. పార్టీల‌కు ఉన్న చ‌రిష్మా, త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో నాయ‌కుడు అందుబాటులో ఉండ‌డం వంటి కీల‌క విష‌యాల‌ను ఇక్క‌డి ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ నాయ‌కులు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండేందుకు వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే.. జిల్లా కేంద్రంగా చేసిన‌ప్ప‌టికీ.. ర‌వాణా స‌దుపాయం వంటివి క‌ల్పించ‌క‌పోవ‌డం వైసీపీకి మైన‌స్‌గా మారింది. మ‌రి ఎవ‌రు ?గెలుస్తారో చూడాలి.

Related posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?