NewsOrbit
న్యూస్

‘ప్రభుత్వం పంపిస్తేనే పోతాం’

 

తిరుమల: వివాదాల నడుమ అధికారులు వాకౌట్ చేయడంతో టిటిడి పాలకవర్గ సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న వేళ టిడిపి ప్రభుత్వ హయాంలో నియమితులైన టిటిడి పాలకమండలి సమావేశం నిర్వహించడంపై వైసిపి నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో నేటి సమావేశాన్ని వైసిపి నేతలు అడ్డుకుంటారని భావించి సమావేశ మందిరమైన అన్నమయ్య భవనం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సమావేశానికి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, సభ్యులు సుధా నారాయణమూర్తి, శ్రీకృష్ణ, మేడా రామకృష్ణారెడ్డి, చల్లా బాబు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నామని చైర్మన్ సుధాకర్ యాదవ్ మీడియాకు తెలిపారు. సమావేశం ప్రారంభమైన కొద్ది సేపటికే టిటిడి కార్వనిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్, జెఇవో శ్రీనివాసరాజులు వాకౌట్ చేసి బయటకు వచ్చారు. దీంతో సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించారు. ఈ సందర్భంగా చైర్మన్ సుధాకర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదిన పాలకవర్గ సమావేశం నిర్వహించాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నేటికి వాయిదా వేసినట్లు అధికారులు తెలియజేశారన్నారు. నేటి సమావేశానికి సంబంధించిన ఎజెండాపై చర్చించి తీర్మానాలు చేయాలని భావించామనీ, అధికారులు ప్రార్థన అనంతరం వాకౌట్ చేసి వెళ్లిపోవడం వల్ల సమావేశాన్ని వాయిదా వేశామనీ తెలిపారు. ‘ప్రభుత్వం మా పాలకవర్గాన్ని నియమించింది. వెంకటేశ్వరస్వామి సన్నిధిలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశాం. కొత్త ప్రభుత్వం తప్పుకోమని ఉత్తర్వులు ఇస్తే తప్పుకుంటాం. రాజీనామా చేయడానికి మాకు సెంటిమెంట్ అడ్డువస్తోంది‘ అని సుధాకర్ యాదవ్ అన్నారు.

ఎన్నికల ఫలితాల అనంతరం సభ్యులు పార్థసారధి, రాయపాటి సాంబశివరావు, బొండా ఉమా, చల్లా బాబులు రాజీనామా చేశారు.

 

 

 

 

 

 

Related posts

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Leave a Comment