NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేకు టెన్ష‌న్ మొద‌లైందా..

ఏపీలో గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయినా ఆ పార్టీకి 23 సీట్లు వచ్చాయి. ఇక తాజా ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ కచ్చితంగా గెలిచే సీట్లు ఏవి అంటే కొన్ని పేర్లు చెప్తారు. ఇక ప్రస్తుతం టిడిపి సీటింగ్ ఎమ్మెల్యేలలో కొందరు ఇప్పటికే వరుసగా మూడు విజయాలు సాధించగా.. మరికొందరు ఎన్నికలలో వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ విజయాలు సొంతం చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. టిడిపి కచ్చితంగా గెలిచే సీట్లలో విశాఖ నగరంలోని తూర్పు సీటు కూడా ఉంటుంది.

Has tension started for TDP hat-trick MLA?
Has tension started for TDP hat-trick MLA?

2009లో నియోజకవర్గాల పునర్విభజనలో విశాఖ తూర్పు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అక్కడ విజయం సాధింస్తూనే ఉంది. ఈ మూడు సార్లు కూడా టిడిపి నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు పోటీ చేసి వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నారు. ఇక తాజా ఎన్నికలలో ఆయన నాలుగోసారి పోటీకి రెడీ అవుతున్నారు. అయితే ఈసారి ఎందుకో గాని ఆయన కాస్త కలవర పడుతూనే ఎన్నికల యుద్ధం చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆయనలో మునుపటి వేగం కొంత తగ్గింది అని అంటున్నారు.

దానికి ప్రధాన కారణం ఆయన ప్రత్యర్థిగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఉన్నారు. ఆయనను వైసీపీ 7 – 8 నెలల క్రితమే అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ అధిష్టానం. ఆయన కూడా జనంలో ఉంటున్నారు. వెలగపూడి అంగ‌బలం.. అర్ధబలం ఉన్నవారే. అయితే ఎంవివీ ఆయన కంటే చాలా బలంగా ఉన్నారు అంటున్నారు. దీనికి తోడు ఎంవీవీ ప్రస్తుతం విశాఖ సిట్టింగ్ ఎంపీగా ఉండడంతో పాటు తూర్పు నియోజకవర్గ అభివృద్ధిపై బాగా దృష్టిసారించారు. ప్రస్తుత నగర మేయర్ గొల‌గాని వెంక‌ట‌ హరికుమారి కూడా తూర్పు నియోజకవర్గం లోనే ఉండడంతో పాటు అక్కడ ఎక్కువ నిధులు కేటాయించి బాగా అభివృద్ధి జరిగేలా చేశారు.

ఇక స్థానిక సంస్థల ఎన్నికలలో తూర్పు నియోజకవర్గంలో వైసిపి కార్పొరేటర్లు ఎక్కువగా గెలిచారు. వెలగపూడి కమ్మ సామాజిక వర్గం వారు. అయితే ఎంవీవీ కూడా క‌మ్మ‌ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇటు కమ్మ‌ సామాజిక వర్గంలో చీలిక‌తో పాటు ఇతర బీసీ కులాలు… యాదవ సామాజిక వర్గంలోనూ కొన్ని ఓట్లు చేరి ఈసారి వైసీపీకి అనుకూలంగా పడతాయని అంటున్నారు. ఎంవివీ పాదయాత్రలు చేస్తూ వెలగపూడి కంటే బాగా దూసుకుపోతున్నారు. ఎక్కడికి అక్కడ సొంత నిధులు వెచ్చిస్తూ ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. టిడిపి బలంగా ఉన్నచోట ఆ క్యాడర్ను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు.

విశాఖ తూర్పు నియోజకవర్గం లో యాదవ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. ఇదే నియోజకవర్గానికి చెందిన మేయర్ హరికుమార్ కి గాజువాక సీటు ఇస్తున్నారు. దీంతో ఆ వర్గం ఓట్లు వైసిపి వన్ సైడ్‌గా పడనున్నాయి. ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వెలగపూడికి నియోజకవర్గం లో కొంత వ్యతిరేకత కూడా ఉంది. అందుకే గతంతో పోలిస్తే ఈసారి వెలగపూడి కి గెలుపు అంత ఈజీ కాదని ఆయన ఏటికి ఎదురీదుతున్నారని విశాఖ నగర రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది.

Related posts

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?