NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో కాంగ్రెస్ టార్గెట్ చాలా సింపుల్‌…!

తాజాగా ఏపీ కాంగ్రెస్ టార్గెట్ ఎంతో తెలిసిపోయింది. తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నోటి నుంచి కాంగ్రెస్ పెట్టుకున్న టార్గెట్ తెలిసి వ‌చ్చింది. 25 అసెంబ్లీ, 5 పార్ల‌మెంటు స్థానాల‌ను గెలిపించాల‌ని ఆయన ఏపీ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఇది చాలా సింపుల్ టార్గెట్టే. ఒక‌ప్పుడు ఉమ్మ‌డి రాష్ట్రాన్ని అప్ర తిహతంగా పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఇది.. సాధించ‌డం పెద్ద క‌ష్టమా? అనే ప్ర‌శ్న‌లు రావొచ్చు. అయితే.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. ఏర్ప‌డిన ప‌రిస్థితుల‌తో కాంగ్రెస్ త‌న ఓటు బ్యాంకును తానే పోగొట్టుకుంది.

అయితే.. గ‌త రెండు మాసాలుగా వైఎస్ ష‌ర్మిల దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌తీరు.. సొంత సోద‌రుడు, సీఎం జ‌గ‌న్‌పై చేస్తున్న విమ‌ర్శ‌లు, రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతున్న‌తీరుతో ప్ర‌స్తుతం నిర్దేశించుకున్న ల‌క్ష్యం చిన్న‌దే. అయితే.. ఇది సాధించ‌డం సాధ్య‌మేనా? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌. ఎందుకంటే.. క్షేత్ర‌స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఫండింగు చేసే నాయ‌కులు ఉన్నారు. కానీ, ఇప్పుడు స‌హ‌క‌రిస్తారా? అనేది ప్ర‌శ్న‌.

అంతేకాదు.. బ‌ల‌మైన రెడ్డి సామాజిక వ‌ర్గం ఒక‌ప్పుడు కాంగ్రెస్‌ను భుజాల‌పై మోసింది. కానీ, ఇప్పుడు ఆ వ‌ర్గ‌మే జ‌గ‌న్ వైపు నిలిచింది. ఈయ‌న నుంచి రెడ్డి వ‌ర్గాన్ని దారి మ‌ళ్లించి త‌న దారిలో పెట్టుకోవ‌డంలో ష‌ర్మిల స‌క్సెస్‌రేటును బ‌ట్టే.. కాంగ్రెస్ పెట్టుకున్న టార్గెట్ సాధించేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ..జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డ‌మేధ్యేయంగా పెట్టుకున్న నేప‌థ్యంలో రెడ్డి వ‌ర్గం ష‌ర్మిల‌కు క‌నెక్ట్ కాలేక పోయింది. ఆమె అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు రెడ్డి వ‌ర్గాన్ని చేరువ చేసుకునే ప్ర‌య‌త్నాలు కూడా చేయ‌లేదు.

బీసీ వ‌ర్గాలైన కొణ‌తాల రామ‌కృష్ణ వంటి కొంద‌రి ఇళ్ల‌కు వెళ్లినా.. వారు రాబోమ‌ని తేల్చి చెప్పారు. ఇక‌, 175 స్థానాలకు తాము ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించ‌గా 1500 మంది అప్లికేష‌న్లు ఇచ్చార‌ని కాంగ్రెస్ చెబుతోంది. వీరిలో ఎంత మంది బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నార‌నేది ప్ర‌శ్న‌. కీల‌క‌మైన సాకే శైల‌జానాథ్ వంటివారు పోటీకి దూరంగా ఉన్నార‌ని స‌మాచారం. ఇక‌, ఎక్క‌డిక‌క్క‌డ కేడ‌ర్‌ను బ‌లోపేతం చేయ‌డంపైనా ష‌ర్మిల దృష్టి పెట్ట‌లేదు. సో.. ఈ లోపాలు ఇన్నిపెట్టుకుని.. టార్గెట్ ఎంత నిర్ణ‌యించుకున్న‌ప్ప‌టికీ.. ప్ర‌యోజ‌నం ఉంటుందా? అనేది ప్ర‌శ్న‌. చూడాలి మ‌రి ఏం చేస్తారో.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju