NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

Venkatesh: ఒక భాషలో విజయం సాధించిన చిత్రాన్ని వేరొక భాషలో రీమేక్ చేయడం అనేది చాలా కామన్. ఇది ఇప్పుడు మొదలైంది కాదు.. గత కొన్ని తరాల నుంచి రీమేక్ ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్ లో కూడా ప్రతి ఏడాది ఎన్నో రీమేక్ చిత్రాలు విడుదల అవుతూ ఉంటాయి. అలాగే తెలుగులో హిట్ అయిన చిత్రాలను ఇతర భాషల్లో రీమేక్ కావడం కూడా చూస్తూనే ఉన్నాము. అయితే అలా గతంలో ఓ తెలుగు సినిమా ఇతర భాషల్లో రీమేక్ చేయబడింది. అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఆరు భాషల్లో ఆ చిత్రాన్ని రీమేక్‌ చేశారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. రీమేక్ అయిన ఆరు భాషల్లోనూ ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కంటెంట్ బాగుంటే ఏ భాషలో అయినా ఆదరణ లభిస్తుంది అని ఆ తెలుగు సినిమా నిరూపించింది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు పవిత్ర బంధం.

విక్టరీ వెంకటేష్, దివంగత నటి సౌందర్య జంటగా నటించిన ఈ చిత్రాన్ని దిగ్గజ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించారు. ఒక‌ప్పుడు వెంకటేష్ , సౌందర్య జంట‌కు వెండితెర‌పై స‌ప‌రేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. వీరిద్ద‌రూ క‌లిసి ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించారు. అందులో ప‌విత్ర బంధం మొద‌టి స్థానంలో ఉంటుంది. గీతా చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్ పై సి. వెంకటరాజు, జి. శివరాజు క‌లిసి నిర్మించిన ఈ ఫ్యామిలీ డ్రామాకు కీర‌వాణి సంగీతం అందించారు.

ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సుత్తివేలు, శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్, అన్నపూర్ణ, బ్రహ్మానందం, బేతా సుధాకర్ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. 1996 అక్టోబ‌ర్ 17న ప్రేక్ష‌కుల‌కు ముందుకు వ‌చ్చిన ప‌విత్ర బంధం సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపించింది. వివాహం అనేది ఒక ప్రత్యేకమైన బంధం అనే స్పష్టమైన సందేశాన్ని ఈ చిత్రం ద్వారా అందించారు.

పెళ్ళి విశిష్టత‌ను, దాని గొప్పతనాన్నీ ఎంతో సున్నితంగా, హృద్యంగా ప‌విత్ర బంధంలో చిత్రీకరించారు. అలాగే నిజ‌మైన భార్య‌భ‌ర్త‌లుగా వెంక‌టేష్‌, సౌంద‌ర్య త‌మ న‌ట‌న‌తో వెండితెర‌పై ఒక మ్యాజిక్ ను క్రియేట్ చేశారు. ఇక పాత్ర‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్లేదు. ఈ సినిమాలో ప్ర‌తి సాంగ్ ఒక ఆణిముత్యం. ముఖ్యంగా `అపురూపమైనదమ్మ ఆడజన్మ` సాంగ్ ఇప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ అనే చెప్పుకోవ‌చ్చు. అలాగే ఈ చిత్రానికి మూడు నంది అవార్డులు వ‌చ్చాయి. ఉత్త‌మ చిత్రంగా ప‌విత్ర బంధం బంగారు నందిని సొంతం చేసుకుంది. తెలుగులో విజ‌య‌వంత‌మైన ఈ చిత్రాన్ని ఆరు భాష‌ల్లో రీమేక్ చేశారు.

1996లో ఒరియాలో సుహాగ్ సింధూర టైటిల్ తో ప‌విత్ర బంధాం రీమేక్ చేయ‌బ‌డింది. అక్క‌డ సిద్ధాంత, రచనా బెనర్జీ జంట‌గా న‌టించారు. అలాగే క‌న్న‌డ‌లో 1998లో మాంగళ్యం తంతునానేన పేరుతో రీమేక్ చేసి విడుద‌ల చేశారు. క‌న్న‌డ భాష‌లో వి. రవిచంద్రన్, రమ్యకృష్ణ హీరో, హీరోయిన్లుగా చేశారు. అనిల్ క‌పూర్‌, కాజోల్ జంట‌గా హమ్ ఆప్కే దిల్ మే రెహతే హై టైటిల్ తో ప‌విత్ర బంధం చిత్రాన్ని చేశారు. బాలీవుడ్ లో 1999లో ఈ మూవీ రిలీజ్ అయింది. 2000లో బంగ్లాదేశ్ లో ఇ బధోన్ జబేనా చీరే టైటిల్ తో, తమిళంలో ప్రియమానవాలే టైటిల్ తో ప‌విత్ర బంధం సినిమాను పున‌ర్నిర్మితం చేశారు. ఇక 2009లో సాత్ పాకే బంధ గా బెంగాలీలో రీమేక్ అయ్యి విడుద‌ల అయింది. అన్ని భాష‌ల్లోనూ ప‌విత్ర బంధం చిత్రానికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్టి విజ‌య‌వంతం చేయ‌డం విశేషం.

Related posts

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri