Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా అభిమానులు సినీప్రియలు మరియు సినీ తారలు రామ్ చరణ్ కు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అలాగే మరోవైపు రామ్ చరణ్ కు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మరియు అరుదైన ఫోటోలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా భారీ అంచనాల నడుమ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. చిరుత మూవీతో హీరోగా కెరీర్ ప్రారంభించాడు. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 2007లో విడుదలై మంచి విజయం సాధించింది.
అటు పిమ్మట రాజమౌళి డైరెక్షన్ లో మగధీర చిత్రంలో నటించిన రామ్ చరణ్.. రెండో సినిమాకే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాతే రామ్ చరణ్ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. రామ్ చరణ్ మూడో చిత్రం ఆరెంజ్. నాగబాబు నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2010లో విడుదలై డిజాస్టర్ అయింది. ఆ తర్వాతి ఏడాది రామ్ చరణ్ రచ్చ మూవీ తో ప్రేక్షకులు పలకరించాడు. కానీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిం. రెండు ఫ్లాపులతో ఏడాది గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్.. 2013లో జంజీర్ మూవీతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు.
అపూర్వ లాఖియా డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అయితే జంజీర్ చిత్రం ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. పైగా ఈ మూవీ రామ్ చరణ్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసింది. చెక్క ముఖం హీరో అంటూ నార్త్ సినీ ప్రియులు, బాలీవుడ్ మీడియా రామ్ చరణ్‌ను ఘోరంగా అవమానించారు. రామ్ చరణ్ కి నటన రాదని సర్టిఫికెట్ కూడా జారీ చేశారు.
అయితే విమర్శలు వచ్చినా రామ్ చరణ్ వెనకడుగు వేయలేదు. పరాజయాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగాడు. సినిమా సినిమాకు తన నటనను మెరుగుపరుచుకున్నారు. ప్రాంతీయ స్టార్ నుంచి గ్లోబర్ స్టార్ గా ప్రసిద్ధి చెందాడు. ఎవరైతే తనకు నటన రాదని విమర్శించారో.. వారి చేతే గొప్ప నటుడని ప్రశంసలు అందుకున్నారు. ఇక 17 ఏళ్ల ఫిల్మ్ కెరీర్ లో రామ్ చరణ్ మొత్తం 14 చిత్రాల్లో నటించాడు.
చిరుత, మగధీర, ఆరెంజ్, రచ్చ, నాయక్, జంజీర్, ఎవడు, గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ – ది ఫైటర్, ధృవ, రంగస్థలం, వినయ విధేయ రామ, ఆర్ఆర్ఆర్, ఆచార్య చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే వీటిలో రామ్ చరణ్ మోస్ట్ ఫేవరెట్ మూవీ ఏదో తెలుసా.. చాలా మంది ఆర్ఆర్ఆర్ లేదా మగధీర అని చెబుతున్నారు. కానీ అవి రెండు కాదు.. రామ్ చరణ్ కు తాను నటించిన చిత్రాల్లో రంగస్థలం అంటే ఎంతో ఇష్టం. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2018లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాతోనే రామ్ చరణ్ సంపూర్ణ నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. అలాగే రంగస్థలం సినిమా చూస్తూ రామ్ చరణ్ తల్లి సురేఖ భావోద్వేగానికి గురయ్యారట. సినిమా పూర్తి అయ్యాక భారమైన హృదయంతో రామ్ చరణ్ ను పిలిచి పక్కన కూర్చోమని అడిగారట. ఆ క్షణం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని గతంలో రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.