NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

Ranbir Kapoor: ర‌ణ‌బీర్ క‌పూర్.. బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో ఒక‌రు. బ్రహ్మాస్త్ర, యానిమ‌ల్ చిత్రాల‌తో ర‌ణ‌బీర్ క‌పూర్ సౌత్ సినీ ప్రియుల‌కు కూడా చేరువ‌య్యాడు. ముఖ్యంగా గ‌త ఏడాది విడుద‌లైన యానిమ‌ల్ చిత్రం ర‌ణ‌బీర్ క‌పూర్ ఇమేజ్ ను డ‌బుల్ చేసింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ర‌ణ‌బీర్ క‌పూర్, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించారు. ఫాద‌ర్ సెంటిమెంట్ తో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపుదిద్దుకున్న యానిమ‌ల్ మూవీ 2023 డిసెంబ‌ర్ 1న హిందీతో పాటు తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 1000 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను సాధించింది.

ర‌ణ‌బీర్ క‌పూర్ కెరీర్ లోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన చిత్రంగా యానిమ‌ల్ రికార్డు సృష్టించింది. ప్ర‌స్తుతం ర‌ణ‌బీర్ క‌పూర్ త‌న త‌దుప‌రి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. బాలీవుడ్‌లో రామాయ‌ణం చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. నితీష్ తివారీ డైరెక్ట్ చేయ‌బోతున్న ఈ చిత్రంలో శ్రీ‌రాముడిగా ర‌ణ‌బీర్ క‌పూర్‌, సీతాదేవిగా న్యాచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి న‌టించ‌బోతున్నారు. ఈ మూవీ కోస‌మే ర‌ణ‌బీర్ క‌పూర్ ప్రిప‌రేష‌న్స్ ప్రారంభించాడు. మేకోవ‌ర్ మార్చుకోవ‌డ‌మే కాకుండా రాముడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసేందుకు విల్లు విద్య‌ను నేర్చుకుంటున్నారు.

ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. తాజాగా ర‌ణ‌బీర్ క‌పూర్ కు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ విష‌యం ఏంటంటే.. ర‌ణ‌బీర్ క‌పూర్ త‌న ముద్దులు కూతురు రాహా క‌పూర్ కు ఓ ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్ గా ఇచ్చాడు. 2022లో ర‌ణ‌బీర్ క‌పూర్ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. త‌న చైల్డ్ హుడ్ ఫ్రెండ్‌, ప్రేయ‌సి మ‌రియు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భ‌ట్ ను ర‌ణ‌బీర్ క‌పూర్ వివాహం చేసుకున్నాడు. పెళ్లి జ‌రిగిన కొద్ది నెల‌ల‌కే ఈ దంప‌తులు త‌మ ఫ‌స్ట్ చైల్డ్ కు వెల్క‌మ్ చెప్పారు.

2022 నవంబ‌ర్ లో అలియా భ‌ట్ పండంటి ఆడ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. త‌మ లిటిల్ ప్రిన్సెస్ కు ర‌ణ‌బీర్ క‌పూర్‌, అలియా భ‌ట్ దంప‌తులు రాహా క‌పూర్ అంటూ నామ‌క‌ర‌ణం కూడా చేశారు. అయితే ఏడాదిన్న‌ర వ‌య‌సున్న రాహాకు ర‌ణబీర్, అలియా ఓ అద్భుత‌మైన కానుక ఇస్తున్నారు. ముంబై బాంద్రా నడిబొడ్డున నిర్మాణంలో ఉన్న బంగ్లాను రాహా పేరు మీద పెడుతున్నార‌ట‌. ఈ బంగ్లా అలియా భ‌ట్‌, ర‌ణ‌బీర్ క‌పూర్ ల డ్రీమ్ హైస్‌. తమ కలల ఇంటి నిర్మాణాన్ని ఏడాది క్రితమే ప్రారంభించారు. ఈ ఇంటిని ర‌ణ‌బీర్‌, అలియా ఎప్ప‌టిక‌ప్పుడు సంద‌ర్శిస్తూనే ఉన్నారు.

తాజాగా రణ‌బీర్‌ కపూర్, అలియా భట్‌తో పాటు నీతూ కపూర్ కూడా ఆ బంగ్లా వ‌ద్ద‌ కనిపించారు. ప‌లు నివేదిక‌ల ప్ర‌కారం.. ఈ బంగ్లా ఖ‌రీదు రూ. 250 కోట్లు ఉంటుంద‌ని తెలుస్తోంది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మన్నత్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ జల్సా బంగ్లాల కంటే ఇది అత్యంత ఖ‌రీదైన సెల‌బ్రిటీ బంగ్లా అని అంటున్నారు. ఇంత ఖ‌రీదైన ఇంటిని ర‌ణ‌బీర్ క‌పూర్, అలియా భ‌ట్ త‌మ కూతురు రాహా పేరు మీద పెడుతున్నారు. దీంతో అతి చిన్న వ‌య‌సులోనే అత్యంత ధనవంతురాలైన స్టార్ కిడ్‌గా రాహా క‌పూర్ పేరుగాంచనుంది.

Related posts

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar