Ranbir Kapoor: రణబీర్ కపూర్.. బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో ఒకరు. బ్రహ్మాస్త్ర, యానిమల్ చిత్రాలతో రణబీర్ కపూర్ సౌత్ సినీ ప్రియులకు కూడా చేరువయ్యాడు. ముఖ్యంగా గత ఏడాది విడుదలైన యానిమల్ చిత్రం రణబీర్ కపూర్ ఇమేజ్ ను డబుల్ చేసింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించారు. ఫాదర్ సెంటిమెంట్ తో యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న యానిమల్ మూవీ 2023 డిసెంబర్ 1న హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్ల రేంజ్ లో వసూళ్లను సాధించింది.
రణబీర్ కపూర్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా యానిమల్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం రణబీర్ కపూర్ తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. బాలీవుడ్లో రామాయణం చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. నితీష్ తివారీ డైరెక్ట్ చేయబోతున్న ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించబోతున్నారు. ఈ మూవీ కోసమే రణబీర్ కపూర్ ప్రిపరేషన్స్ ప్రారంభించాడు. మేకోవర్ మార్చుకోవడమే కాకుండా రాముడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసేందుకు విల్లు విద్యను నేర్చుకుంటున్నారు.
ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా రణబీర్ కపూర్ కు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. రణబీర్ కపూర్ తన ముద్దులు కూతురు రాహా కపూర్ కు ఓ లగ్జరీ బంగ్లాను గిఫ్ట్ గా ఇచ్చాడు. 2022లో రణబీర్ కపూర్ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్, ప్రేయసి మరియు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ను రణబీర్ కపూర్ వివాహం చేసుకున్నాడు. పెళ్లి జరిగిన కొద్ది నెలలకే ఈ దంపతులు తమ ఫస్ట్ చైల్డ్ కు వెల్కమ్ చెప్పారు.
2022 నవంబర్ లో అలియా భట్ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తమ లిటిల్ ప్రిన్సెస్ కు రణబీర్ కపూర్, అలియా భట్ దంపతులు రాహా కపూర్ అంటూ నామకరణం కూడా చేశారు. అయితే ఏడాదిన్నర వయసున్న రాహాకు రణబీర్, అలియా ఓ అద్భుతమైన కానుక ఇస్తున్నారు. ముంబై బాంద్రా నడిబొడ్డున నిర్మాణంలో ఉన్న బంగ్లాను రాహా పేరు మీద పెడుతున్నారట. ఈ బంగ్లా అలియా భట్, రణబీర్ కపూర్ ల డ్రీమ్ హైస్. తమ కలల ఇంటి నిర్మాణాన్ని ఏడాది క్రితమే ప్రారంభించారు. ఈ ఇంటిని రణబీర్, అలియా ఎప్పటికప్పుడు సందర్శిస్తూనే ఉన్నారు.
తాజాగా రణబీర్ కపూర్, అలియా భట్‌తో పాటు నీతూ కపూర్ కూడా ఆ బంగ్లా వద్ద కనిపించారు. పలు నివేదికల ప్రకారం.. ఈ బంగ్లా ఖరీదు రూ. 250 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మన్నత్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ జల్సా బంగ్లాల కంటే ఇది అత్యంత ఖరీదైన సెలబ్రిటీ బంగ్లా అని అంటున్నారు. ఇంత ఖరీదైన ఇంటిని రణబీర్ కపూర్, అలియా భట్ తమ కూతురు రాహా పేరు మీద పెడుతున్నారు. దీంతో అతి చిన్న వయసులోనే అత్యంత ధనవంతురాలైన స్టార్ కిడ్‌గా రాహా కపూర్ పేరుగాంచనుంది.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!