ఒకప్పుడు స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. భారీ బడ్జెట్ సినిమాలను మాత్రమే తెరకెక్కించిన ఈ దర్శకుడు పరిస్థితి `వినయవిధేయరామ` చిత్రంతో మారిపోయింది. ఈ సినిమా ప్లాప్ బోయపాటికి అవకాశాలను దూరం చేశాయా? లేక ఆయన భారీ బడ్జెట్ ప్లానింగ్స్ సినిమా అవకాశాలను రానీయకుండా చేస్తున్నాయా? అనే సంగతిని పక్కన పెడితే.. ప్రస్తుతం బోయపాటి చేతిలో సినిమాలు లేవు. బాలకృష్ణతో చేయాల్సిన సినిమా వాయిదా పడింది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియడం లేదు. ఇలాంటి తరుణంలో బోయపాటికి గీతాఆర్ట్స్ నుండి పిలుపు వచ్చింది. బన్నీతో సినిమా చసే అవకాశం వస్తుందేమోనని అనుకుంటే.. శిరీశ్ను డైరెక్ట్ చేయాలంటూ కోరారట. ఇక కాదనలేని పరిస్థితులు కావడంతో బోయపాటి సరేనన్నాడని టాక్.
previous post
next post
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!