సూపర్‌స్టార్ మహేశ్ 26వ సినిమా `సరిలేరు నీకెవ్వరు` షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాశ్మీర్లో షెడ్యూల్ పూర్తయ్యింది. అయితే ఇక్కడొక విషయంపై ప్రొడక్షన్ మేనేజర్‌పై మహేశ్ ఓ రేంజ్లో కోపగించుకున్నాడని టాక్. విషయమేమంటే.. సాధారణంగా సినిమా యూనిట్ సభ్యులకు షూటింగ్లో అవసరమైన తిండి, నీటిని, ఇతర ఆహార సంబంధమైన విషయాలు, వస్తువులను ప్రొడక్షన్ మేనేజర్స్ పర్యవేక్షిస్తుంటారు. మహేష్ సినిమాకు ప్రొడక్షన్ మేనేజర్ వద్ద పనిచేస్తున్న వాటర్ సప్లై కుర్రాడొకడు ప్యూరిటీ ఉన్న వాటర్ బాటిల్స్ అందించాల్సింది పోయి కార్పొరేషన్ వాటర్ ఇచ్చేవాడు. ఈ వ్యవహారాన్ని పసిగట్టిన ఇతర యూనిట్ సభ్యులు మహేశ్‌కు చేరవేశారు. ఈ సినిమా విషయానికి వచ్చేసరికి నిర్మాణంలో భాగమైన మహేశ్ సదరు ప్రొడక్షన్ మేనేజర్‌పై ఫైర్ అయ్యాడట. గట్టిగా క్లాసు పీకాడట.
previous post
next post
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!