(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
సూర్యాపేటలో ఓ కొండముచ్చు.. మందుబాబులకు మాంచి కంపెనీ ఇచ్చింది. గ్లాసులో ఉన్న మందు గడగడా తాగేసింది. అంతేకాదు స్టఫ్ కూడా నంజుకుంది. ఇలా కొండముచ్చు పెగ్గుమీద పెగ్గు కొడుతూ.. మందుబాబులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. వివరాల్లోకి వెళ్లితే.. సూర్యాపేటలోని ఓ వైన్ షాపుకి కొండంగి (కొండముచ్చు) వచ్చింది. మనుషులతో కలిసి ఏకంగా వైన్ షాపు వద్దే తిష్ట వేసి.. మందు గ్లాసు ఉన్న టేబుల్‌పై కూర్చుంది. ఇంతలో కొండంగి ముందు ఓ మందు గ్లాసు పెట్టారు. అసలే దాహంతో ఉన్న కొండంగి గ్లాసులో ఉన్న మందును గడగడా తాగేసింది. ఏమాత్రం బెరుకు లేకుండా మందు తాగింది. మందుబాబు అందించిన స్టఫ్‌ను కూడా తీసుకుని తినేసింది. పెగ్గు దించగానే స్టఫ్ కూడా తిని అందరినీ ఆశ్చర్య పరిచింది. తర్వాత మెల్లగా అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆ దృశ్యాలను అక్కడే ఉన్న కొంత మంది తమ సెల్ఫోన్లలో చిత్రీకరించి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అది వైరల్‌గా మారింది.
https://www.facebook.com/satyavathi.satya.7927/videos/199960467685355/